Rishabh Pant to get full 16 cr salary from BCCI despite missing IPL 2023: టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. నూతన సంవత్సర వేడుకల కోసం ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా పంత్ కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగగా.. పంత్ కారు విండో నుంచి బయటకు వచ్చాడు. ఈ ప్రమాదంలో పంత్ తల, మోకాలికి గాయాలయ్యాయి. తాజాగా భారత ఆటగాడికి శస్త్రచికిత్స కూడా జరిగింది.
యువ బ్యాటర్ రిషబ్ పంత్ మరో 4 నుంచి 6 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటాడని సమాచారం తెలుస్తోంది. ఇదే నిజమయితే స్వదేశంలో జరిగే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లతో పాటు ఐపీఎల్ 2023 కూడా మిస్ అవుతాడు. అయితే పంత్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. పంత్‌కు ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని బీసీసీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పంత్‌కు బీసీసీఐ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. గాయం కారణంగా పంత్ ఐపీఎల్ 2023లో ఆడకపోయినా.. అతడి ఏడాది వేతనం రూ. 16 కోట్లు చెల్లించనుంది. అంతేకాదు రూ. 5 కోట్లతో సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న పంత్‌కు ఆ మొత్తం కూడా చెల్లించనుంది.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగి ఉన్న భారత ఆటగాళ్లు అందరికీ బీమా ఉంటుందన్న విషయం తెలిసిందే. బీసీసీఐ నిబంధనల ప్రకారం... ఐపీఎల్ ఆడే ఆటగాళ్లు గాయం కారణంగా టోర్నీకి దూరమైతే మొత్తం డబ్బులను ఫ్రాంచైజీలు చెల్లించవు. బీసీసీఐ మాత్రమే ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఆపై బీమా కంపెనీ ఆ డబ్బుని బీసీసీఐకి ఇస్తుంది. అయితే విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడితేనే ఫ్రాంచైజీలు డబ్బు చెల్లిస్తాయి.
రిషబ్ పంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. గత శుక్రవారం పంత్ కుడి కాలు మోకాలి లిగ్మెంట్‌కు చేసిన శస్త్రచికిత్స విజయవంతమైంది. పంత్ కోలుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పట్టనుందని డాక్టర్లు చెప్పారు. ఒకవేళ అప్పటికి కోలుకోకపోతే.. సెప్టెంబరులో జరిగే ఆసియా కప్‌తో పాటు వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీకి దూరమమ్యే అవకాశం ఉంది.
Also Read: Jasprit Bumrah: టీమిండియాకు షాక్.. వన్డే సిరీస్‌కు బుమ్రా దూరం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.