Saturn Moon Conjunction 2023: అరుదైన విష యోగం.. ఈ రాశుల వారి పని ఔట్! రాబోయే 3 రోజులు జాగ్రత్త
Cancer, Virgo and Pisces Zodiac Sign peolpes Be Careful for the next 3 days due to Saturn Moon Conjunction 2023. కుంభ రాశిలో ఏర్పడుతున్న విష యోగం 2023.. ఈ 3 రాశుల వారికి అశుభంగా ఉండనుంది.
These 3 Zodiac Signs Be Careful for the next 3 days due to Vish Yog 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... ప్రతి గ్రహం ఓ నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. శని గ్రహం నిదానంగానూ, చంద్రుడు వేగంగా రాశిని మార్చుతుంటాయి. శని రెండున్నరేళ్ల తర్వాత తన రాశులను మారుస్తాడు. చంద్రుడు మాత్రం రెండున్నర నుంచి మూడు రోజుల్లో మారతాడు. జనవరి 17న కుంభ రాశిలోకి శని చేరుకుంది. ఈ రాత్రి నుంచి చంద్రుడు కూడా కుంభ రాశిలో సంచరిస్తాడు. దీని కారణంగా 'విష యోగం' ఏర్పడుతోంది. ఇది అన్ని రాశుల ప్రజలపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. జ్యోతిషశాస్త్రంలో విష యోగం మంచిగా పరిగణించబడదు. ఎందుకంటే ఈ యోగం అనేక విధాలుగా హాని కలిగిస్తుంది. ప్రస్తుతం కుంభ రాశిలో ఏర్పడుతున్న విష యోగం.. ఈ 3 రాశుల వారికి అశుభంగా ఉండనుంది.
విష యోగం 2023 ఈ రాశుల వారికి హాని కలిగిస్తుంది. కుంభ రాశిలో శని మరియు చంద్రుల కలయికతో ఏర్పడిన 'విష యోగం' ముఖ్యంగా ఈ 3 రాశుల వారికి (కర్కాటకం, కన్యా, మీనం) అశుభంగా ఉండనుంది. ఈ వ్యక్తులు డబ్బు నష్టంతో సహా ఇతర నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. అందువల్ల ఈ వ్యక్తులు రాబోయే 3 రోజులు జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం:
కర్కాటక రాశి వారికి విష యోగం ఏమాత్రం మంచిది కాదు. ఈరాశి వారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మాట్లాడేముందు జాగ్రత్తగా ఉండండి, లేకుంటే ఎవరితోనైనా గొడవలు జరగవచ్చు. మీరు ఉద్యోగం మారాలనుకుంటే.. 3 రోజులు వేచి ఉండండి. మానసిక ఒత్తిడి ఉంటుంది. శివుడి మరియు శని దేవుడిని ఆరాధిస్తే ప్రయోజనాలను పొందుతారు.
కన్యా:
కన్యా రాశి వారికి విష యోగం మంచిది కాదు. వివాదాలు ఎక్కువ అవుతాయి. ఒకవేళ కోర్టులో కేసు నడుస్తుంటే.. ఆ కేసు మీపైకి రావొచ్చు. ప్రయాణంలో మీ వస్తువులను మరియు భద్రతను జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపార విషయంలో జాగ్రత్తగా లావాదేవీలు చేయాలి, లేకుంటే ధన నష్టం సంభవించవచ్చు.
మీనం:
శని, చంద్రుల కలయిక వల్ల ఏర్పడే విష యోగం సమయంలో మీన రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నష్టం జరగవచ్చు. ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. బడ్జెట్ సరిపోదు. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించవద్దు. పెట్టుబడి పెట్టవద్దు. ఉద్యోగస్తులు పని ప్రదేశంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. భాగస్వామ్యంతో పని ప్రారంభించడం మానుకోండి.
Also Read: Car Booking Cancellation: ఈ కార్ బుకింగ్‌ను రద్దు చేసుకుంటే.. భారీ మొత్తంలో డబ్బు మీ సొంతం!
Also Read: Itel A24 Pro: 5 వేల లోపే సూపర్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు తెలిస్తే పిచ్చెక్కిపోద్ది! గుడ్ లుకింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.