These 3 Zodiac Signs Wealth will become double due to Venus and Jupiter Transit in Pisces 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట వ్యవధిలో తన రాశిని మారుస్తుంది. ఈ గ్రహ సంచారాలు అనేక శుభ మరియు అశుభకరమైన కలయికను కూడా సృష్టిస్తాయి. ఈ క్రమంలో మీన రాశిలో అద్భుతమైన కలయిక ఏర్పడనుంది. 12 సంవత్సరాల తరువాత బృహస్పతి తన స్వరాశి అయిన మీన రాశిలో ఉన్నాడు. అదృష్టాన్ని, సంతోషాన్ని ఇచ్చే గ్రహంగా బృహస్పతి పరిగణించబడ్డాడు. ఇక ఫిబ్రవరి 15న సంపద-విలాసం, ప్రేమకు కారకుడైన శుక్రుడు కూడా మీన రాశిలోకి ప్రవేశించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 సంవత్సరాల తరువాత మీన రాశిలో గురు మరియు శుక్రుల కలయిక ఏర్పడింది. ఈ రెండు గ్రహాల కలయిక అన్ని రాశుల ఆర్థిక స్థితి, వైవాహిక జీవితం, ప్రేమ జీవితం, ఆనందం మరియు అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే గురు, శుక్ర గ్రహాల కలయిక ముఖ్యంగా 3 రాశులకు శుభప్రదంగా ఉండనుంది. ఆ రాశుల వారి సంపద రాత్రికి రాత్రే డబుల్ అవుతుంది. ఆ మూడు రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. 


మేషం: 
గురు మరియు శుక్రుల కలయిక మేష రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తుల జీవితాల్లో ఆనందం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో అనేక పనులు పూర్తవుతాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరుతుంది. స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.


కర్కాటకం:
గురు మరియు శుక్రుల కలయిక కర్కాటక రాశి వారికి మంచి ప్రయోజనాలను ఇస్తుంది. ఈ సమయంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. గతంలో నిలిచిపోయిన పని కూడా పూర్తవుతుంది. ఉద్యోగ-వ్యాపారాలలో లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. విహారయాత్రకు వెళ్లవచ్చు. ప్రతి పనిలో విజయం వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది.


వృషభం: 
వృషభ రాశి వారికి గురు, శుక్రుల కలయిక చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. రాత్రికి రాత్రే పెద్ద మొత్తంలో డబ్బు రావొచ్చు. కెరీర్‌లో అకస్మాత్తుగా పెద్ద ప్రమోషన్ రావచ్చు. జీవితంలో సుఖాలు పెరుగుతాయి. కొత్త పనులు ప్రారంభించగలరు. ఒంటరి వ్యక్తులకు వివాహం అవుతుంది. 


Also Read: Sravanthi Chokarapu Pics: బ్లూ శారీలో స్రవంతి చొక్కారపు.. కొంటె చూపులతో కుర్రాళ్లకు వలపుల వల!  


Also Read: Lucky Zodiac Sign: ఈ 3 రాశుల వారిపై కుబేరుడి అనుగ్రహం.. ధనవంతులు అవడం పక్కా! టాటా-అంబానీ మాదిరి  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.