These 3 Zodiac Signs will face more Difficulties in life due to Saturn Transit in Aquarius 2023: శని దేవుడు రెండున్నరేళ్ల తర్వాత తన రాశిని మారుస్తాడు. ఈ క్రమంలో 2023 సంవత్సరం ప్రారంభంలోనే తన రాశిని మార్చనున్నాడు. 2023 జనవరి 17న తన సొంత రాశి కుంభ రాశిలోకి శని ప్రవేశించబోతోంది. మకర రాశిని విడిచిపెట్టిన శని.. కుంభ రాశిలోకి ప్రవేశించడం ఓ పెద్ద సంఘటనగా భావించాలి. ఎందుకంటే శని 30 సంవత్సరాల తర్వాత కుంభ రాశిలో సంచరిస్తుంది. శని ఒక రాశిలో సంచరించినప్పుడల్లా.. ఆ రాశిచక్రం ముందు మరియు వెనుక ఉన్న రాశిపై శని యొక్క సడే సతి ప్రారంభమవుతుంది.  జనవరి 17న జరగబోయే శని రాశి మార్పు వల్ల కొందరికి కష్టాలు మొదలవుతాయి. ఇదే సంచారం కొంతమందికి శుభ ఫలితాలను కూడా ఇస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటక, వృశ్చిక రాశుల వారికి మొదలు:
2023 జనవరి 17న కుంభ రాశిలో శని ప్రవేశించిన వెంటనే.. కర్కాటక, వృశ్చిక రాశి వారికి శని మొదలవుతుంది. మరోవైపు మిథునం మరియు తులా రాశి వారికి శని ముగుస్తుంది. ఈ శని సంచారం వల్ల కర్కాటక మరియు వృశ్చిక రాశి ప్రజలకు కష్టమైన దశ ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ఈ సమయంలో ఈ రెండు రాశుల వ్యక్తుల జీవితంలో కష్టాలు పెరుగుతాయి. ధన నష్టం కలగవచ్చు. వ్యాధులు ఎప్పుడూ వెంటే ఉంటాయి.


మకర, కుంభ రాశుల బాధలు తగ్గుతాయి:
శని గ్రహం కుం భరాశిలోకి ప్రవేశించిన వెంటనే.. మీన రాశి వారికి శని మొదటి దశ ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం శని కారణంగా మీన రాశి వారు ఎక్కువగా ప్రభావితమవుతారు. కష్టానికి పూర్తి ఫలితం లభించదు. జీవితంలో ఎంతో  కష్టపడాలి. ధన నష్టం, ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. అంతేకాకుండా మకర, కుంభ రాశులకు కూడా శని సడే సాటి ప్రభావం ఉంటుంది. అయితే మకర రాశిలో శని సడే సతి చివరి దశ కారణంగా.. ఈ రెండు రాశుల వారి బాధలు తగ్గుతాయి. శని శుభ ఫలితాలను ఇస్తుంది.


శని నివారణలు:
శని సడే సతి మరియు ధయ బాధల నుంచి ఉపశమనం పొందడానికి ఓ మార్గం ఉంది. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలి. ప్రతి శనివారం శని ఆలయంలో నూనె సమర్పించండి. రావి చెట్టు కింద ఆవ నూనె దీపం వెలిగించండి. నిస్సహాయ, పేద ప్రజలకు మీకు తోచిన సహాయం చేయండి. శనికి సంబంధించిన వస్తువులను దానం చేయండి.


Also Read: ICC T20 Rankings: 40 స్థానాలను ఎగబాకిన దీపక్‌ హుడా.. టాప్ 10లో ఒక్క ఇండియన్ ప్లేయర్ లేడు!  


Also Read: KIA EV6 Car: ఈ క్రేజీ కారు కొనేవారికి షాకింగ్ న్యూస్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.