Scorpio, Capricorn and Leo Zodiac Sign Peoples Will Success in Business after Budh Gochar 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం... ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో సంచరిస్తుంది. ప్రతి గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంది. ఇలా ప్రవేశించడం వల్ల మొత్తం 12 రాశుల జీవితాలు ప్రభావితం అవుతాయి. ఫిబ్రవరి 7న మకర రాశిలోకి బుధుడు ప్రవేశించాడు. ఇప్పటికే మకర రాశిలో సూర్యుడు ఉండటంతో.. బుధ, సూర్య కలయిక ఏర్పడింది. బుధుడు, సూర్యుడు కలయికతో బుధాదిత్య యోగం ఏర్పడింది. జ్యోతిషశాస్త్రంలో బుధాదిత్య యోగం చాలా పవిత్రమైనది, ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ యోగం వలన కొన్ని రాశుల వారు కెరీర్‌లో పురోగతి, బిజినెస్‌లో విజయం సాధిస్తారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృశ్చిక రాశి:
బుధుడు మరియు సూర్యుని కలయికతో ఏర్పడిన బుధాదిత్య రాజయోగం.. వృశ్చిక రాశి వారికి చాలా శుభప్రదంగా, ఫలప్రదంగా ఉండబోతోంది. రాజకీయాలతో సంబంధం ఉన్న వృశ్చిక రాశి వారికి కొంత స్థానం లభిస్తుంది. ఈ కాలంలో మీ గౌరవం పెరుగుతుంది. వృశ్చిక రాశి వారు పెట్టుబడి నుంచి లాభం పొందే  అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు కెరీర్‌లో పురోగతి సాధించే అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి.


మకర రాశి:
మకర రాశి వారికి బుధాదిత్య యోగం అనుకూలంగా ఉంటుంది. మకర రాశిలో సూర్యుడు మరియు బుధుడు బలంగా ఉన్న కారణంగా ఈ సమయంలో మీరు కోర్టులో విజయం సాధిస్తారు. పాత వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు శత్రువులపై విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబంతో హాయిగా ఉంటారు. 


సింహ రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహ రాశి వారికి బుధాదిత్య రాజయోగం చాలా శుభప్రదంగా ఉంటుంది. సింహ రాశి వారు పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. ఈ సమయంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. ఉద్యోగులు మరింత బాధ్యతను పొందవచ్చు. ప్రేమ వ్యవహారాలలో కూడా విజయం పొందవచ్చు. సంతానం పొందాలనుకునే వారికి త్వరలో శుభవార్త అందుతుంది.


Also Read: Turkey Syria Earthquake: టర్కీ, సిరియాల్లో 12 వేలకు చేరిన మృతులు.. 8 వేల మందిని రక్షించిన సహాయ బృందాలు!  


Also  Read: Malavika Menon Pics: శారీలో మాలవిక మీనన్.. మలయాళం బ్యూటీ మత్తెక్కించే అందాలు చూడతరమా!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.