These 4 Zodiac Signs will succeed in every work after Mercury Transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... ఏదైనా గ్రహం లేదా రాశి తన రాశిని మార్చినప్పుడు ఆ ప్రభావం మొత్తం 12 రాశుల మీద ఉంటుంది. ఈ సంచారం కొన్ని రాశుల వారికి శుభప్రదమైనదిగా ఉంటే.. కొన్ని రాశుల వారికి అశుభప్రదంగా ఉంటుంది. గ్రహాల రాశి చక్ర మార్పు వల్ల చాలాసార్లు శుభ యోగం ఏర్పడుతుంది. గ్రహాల రాకుమారుడిగా పేరొందిన బుధుడు.. 2023 ఫిబ్రవరి 7న ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దాంతో 'భద్ర రాజయోగం' ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ రాజయోగం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ భద్ర రాజయోగం ముఖ్యంగా 4 రాశుల వారికి ఫలవంతంగా ఉంటుంది. ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి:
మేష రాశి వారికి బుధ సంచారం చాలా శుభప్రదం అవుతుంది. భద్ర రాజయోగ ప్రభావం వల్ల ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. దాంతో అడుగడుగునా విజయం ఉంటుంది. విద్యా, ఉద్యోగ రంగాలలో పురోగతి కనిపిస్తుంది. అన్ని రంగాలలో విజయం ఉంటుంది.


మిథున రాశి:
మిథున రాశి వారికి బుధ సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. అదృష్టం వెంటే ఉండడంతో ప్రతి పని పూర్తి చేస్తారు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యాపారులు భారీ లాభాలను పొందుతారు. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది.


కన్యా రాశి:
కన్యా రాశి వారికి భద్ర రాజయోగం అదృష్టంను ఇస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం ప్రారంభమవుతుంది. ప్రతి పనిలో విజయం ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు రాక ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.


ధనుస్సు రాశి: 
ధనుస్సు రాశి వారు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తే.. భద్ర రాజయోగం ఏర్పడిన తర్వాత పని ఆరంబించండి. ఈ సమయంలో భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది.


Also Read: Aishwarya Rai notice: ఐశ్వర్యా రాయ్ కి షాకిచ్చిన అధికారులు.. కోట్లున్నా 20 వేలు కట్టలేరా?  


Also Read: Venus Transit 2023: కుంభ రాశిలోకి శుక్రుడు.. ఈ రాశుల వారు ధనవంతులు అవడం పక్కా! ఊహించని బ్యాంక్ బ్యాలెన్స్  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.