These 5 zodiac signs will get bumper benefits due to Sun Trigrahi Yoga 2022: గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ఈరోజు (16 డిసెంబర్ 2022) ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు. ధనుస్సు రాశిలో ఇప్పటికే బుధ, శుక్ర గ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ధనుస్సు రాశిలో సూర్యుడి ఎంట్రీ (సూర్య సంచారం)తో 'త్రిగ్రాహి యోగం' ఏర్పడింది. సూర్యుని రాశి మార్పు వల్ల ఏర్పడే ఈ త్రిగ్రాహి యోగం 5 రాశుల వారికి అదృష్టాన్ని తేనుంది. 16 డిసెంబర్ 2022న ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు.. 2023 జనవరి 14 వరకు అక్కడే ఉంటాడు. బుధ మరియు శుక్ర గ్రహాలు డిసెంబర్ 2022 చివరి వరకు ధనుస్సులోనే ఉంటాయి. ఈ త్రిగ్రాహి యోగం కారణంగా రాబోయే 15 రోజులు ఈ 5 రాశుల వారికి మంచి ప్రయోజనాలను ఇస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం: 
సూర్య సంచారం మేష రాశి ప్రజల అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. మేష రాశి వారు ఈ సమయంలో గొప్ప విజయాలు సాధిస్తారు. చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. కెరీర్ పరంగా సుదీర్ఘ ప్రయాణం చేస్తారు. తండ్రి నుంచి సహాయం అందుతుంది.


వృషభం: 
సూర్య సంచారం వలన ఏర్పడిన 'త్రిగ్రాహి యోగం' వృషభ రాశి వారికి అన్ని విషయాలలో లాభాలను ఇస్తుంది. ఉద్యోగ మార్పు ఉంటుంది. ప్రమోషన్, జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. భారీగా ఆదాయం పెరుగుతుంది.


తులా: 
సూర్యుని సంచారం తులా రాశి వారికి ఆత్మ విశ్వాసం మరియు ధైర్యం కలిగిస్తుంది. తులా రాశి వారి కెరీర్‌లో లాభాలు ఉన్నాయి. భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూర్చే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీరు చేసే పనులు ప్రశంసించబడతాయి. కొన్ని ముఖ్యమైన పనిలో తండ్రి నుంచి సహాయం అందుతుంది.


ధనుస్సు: 
సూర్య సంచారం కారణంగా ధనుస్సు రాశిలోనే త్రిగ్రాహి యోగం ఏర్పడింది. కాబట్టి సూర్య సంచారం కారణంగా ధనుస్సు రాశి వారు గరిష్ట ప్రయోజనాలు పొందుతారు. పదవి, ధన లాభం ఉంది. ప్రభుత్వం నుంచి కూడా మంచి ప్రయోజనాలు అందుతాయి. వ్యాపారస్తులు కూడా అధిక లాభాలు పొందుతారు. వ్యూహాలు ఫలిస్తాయి.


మీనం: 
మీన రాశి వారికి సూర్య సంచారం వలన చాలా మేలు జరుగుతుంది. లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంటారు. అడ్డంకులు తొలగిపోతాయి. వృత్తి జీవితంలో మంచి లాభం ఉంటుంది. ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు ఉండవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి.


Also Read: Lionel Messi Injury: ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు ముందు అర్జెంటీనాకు బిగ్‌ షాక్‌.. లియోనెల్ మెస్సీ ఆడడం అనుమానమే! 


Also Read: Friday Remedies: శుక్రవారం ఈ చిన్న నివారణలు చేస్తే.. బీరువా నిండా డబ్బేడబ్బు! ప్రయత్నించి చూడండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.