Tholi Ekadasi 2023: ఆషాఢ మాసంలోని శుక్ల పక్షంలో ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. దీనినే తెలుగువారు తొలి ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుకి పూజా కార్యక్రమాలు చేసి ఉపవాసాలు పాటించడం వల్ల జీవితంలో సకల శుభాలు కలుగుతాయి. ఈ సంవత్సరం తొలి ఏకాదశి జూన్ 29 రాబోతోంది. హిందూ పురాణాల ప్రకారం.. శ్రీమహావిష్ణువు నిద్రించే సమయంగా భావిస్తారు. అంతేకాకుండా దీనిని చతుర్మాసం అని కూడా అంటారు. నాలుగు నెలలపాటు శుభకార్యాలు జరపడం నిషిద్ధమని  పురాణాల్లో పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలి ఏకాదశి ప్రాముఖ్యత:
ఈ ఏకాదశికి పురాణాల నుంచి ఎంతో ప్రాముఖ్యత ఉందని.. ఈరోజే కొన్ని పవిత్ర యోగాలు ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ఈ సంవత్సరం తొలి ఏకాదశి గురువారం రోజున వస్తోంది. కాబట్టి మంచి రోజుగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు స్త్రీలంతా మహావిష్ణువుని పూజించి ఉపవాసాలు పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.


Also Read: Guntur Karam Movie: 'గుంటూరు కారం' నుంచి పూజా హెగ్డే ఔట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..?


తొలి ఏకాదశి తొలి ఏకాదశి శుభ సమయాలు:
ఏకాదశి తిథి ప్రారంభం: 29 జూన్ నుంచి మధ్యాహ్నం 03:18 గంటల వరకు..
ఏకాదశి తిథి ముగుస్తుంది: 30 జూన్ మధ్యాహ్నం 02:42 గంటలకు..


తొలి ఏకాదశి ఉపవాస సమయాలు:
తొలి ఏకాదశి వ్రతం ఉపవాసాలు పాటించాలనుకునేవారు జూన్ 30 రోజు మధ్యాహ్నం 01:48 నుంచి సాయంత్రం 04:36 వరకు సరైన సమయంగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.


 ఏకాదశి ఉపవాస నియమాలు:
తొలి ఏకాదశి రోజున తప్పకుండా నియమ నిబంధనలతో పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మాంసం, మద్యం ముట్టకూడదు. అంతేకాకుండా వెల్లుల్లి, ఉల్లిపాయతో చేసిన ఆహారాలను తినకపోవడం చాలా మంచిది. వీలైతే ఎక్కువసార్లు ఆ విష్ణువుని ధ్యానించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.


Also Read: Guntur Karam Movie: 'గుంటూరు కారం' నుంచి పూజా హెగ్డే ఔట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి