February Grah Gochar Effect 2023:  కాలానుగుణంగా గ్రహాలు తమ రాశులను మారుస్తాయి. ఫిబ్రవరి నెలలో మూడు పెద్ద గ్రహాలు తమ స్థానాన్ని మార్చుకోనున్నాయి. ఈ మూడు గ్రహాల రాశి మార్పు కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. ఈనెలలో ఏయే గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధ గ్రహ సంచారం
ఫిబ్రవరి మెుదటి వారంలోనే గ్రహాల రాకుమారుడైన బుధుడు తన గమనాన్ని మార్చాడు. మెర్క్యూరీ ఫిబ్రవరి 07న తన రాశిని మార్చి మకరరాశిలోకి ప్రవేశించింది. అప్పటికే అక్కడే ఉన్న సూర్యుడితో బుధాదిత్య యోగాన్ని ఏర్పరిచింది. ఈయోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఫిబ్రవరి 27 వరుకు బుధుడు మకరరాశిలో సంచరించనున్నాడు. మేష, వృషభ, కర్కాటక, కన్యా, తుల, కుంభ రాశుల వారికి బుధాదిత్య యోగం మంచి ఫలితాలను ఇవ్వనుంది.  
సూర్య ట్రాన్సిట్
నెలకొకసారి సూర్యభగవానుడు తన రాశిని మారుస్తాడు. సంవత్సరంలో 12సార్లు ఇలా తన రాశిని మారుస్తాడు. ఫిబ్రవరి 13న సూర్యుడు మకరరాశిని వదిలి శనిదేవుడి రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. అప్పటికే కుంభంలో శనితో అతడి కలయిక ఏర్పడనుంది. కుంభంలో రెండు శత్రు గ్రహాల కలయిక వల్ల కొందరికి ఇబ్బందులు తలెత్తువచ్చు. వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. 
శుక్ర గోచారం
సంపద, తేజస్సు, శారీరక సుఖాలకు కారకుడైన శుక్రగ్రహం ఫిబ్రవరి 15న కుంభరాశిని వదిలి మీనరాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ సంచారం రాత్రి 08.12 గంటలకు జరగబోతోంది. ఇప్పటికే మీనంలో బృహస్పతి ఉన్నాడు. శుక్రుడి సంచారం మేషం, వృషభం, కర్కాటకం, మిథునం, సింహం, వృశ్చికం, మకరం, ధనుస్సు, కుంభం మరియు మీనం వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.


Also Read: Shukra Gochar 2023: మీనరాశిలో శుక్రుడి గోచారం.. ఈ రాశుల వారి కెరీర్ అద్భుతం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook