Astro tips for Thursday: హిందువులు వారంలోని ప్రతి రోజూ ఏదో ఒక దేవతను పూజిస్తారు.అలాగే గురువారం విష్ణువును ఆరాధిస్తారు. ఈరోజున శ్రీహరిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. లక్ష్మీదేవి (Goddess Lakshmi) కటాక్షం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. మీకు  దేనికీ లోటు ఉండదు. అందుకే లక్ష్మీదేవి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలంటే గురువారం నాడు ఈ పరిహారాలు చేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురువారం రోజు ఈ పరిహారాలు చేయండి
>> మీరు కోటీశ్వరులు కావాలనుకుంటే.. గురువారం ఉదయాన్నే లేచి స్నానం చేయండి. అనంతరం అరటి చెట్టు వేరుకు నానబెట్టిన పప్పు మరియు బెల్లం ముక్కను సమర్పించండి. మీరు ఐదు లేదా ఏడు గురువారాలు ఈ పరిహారం చేస్తే.. మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.  
>> ఒక రూపాయి నాణెం, ఒక బెల్లం ముక్క మరియు ఏడు పసుపు కొమ్ములను పసుపు గుడ్డలో కట్టి.. గురువారం సాయంత్రం రైల్వే లైన్ దగ్గర విసిరేయండి. ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
>> మీరు కెరీర్ లో పురోగతిని పొందాలనుకుంటే.. గురువారం ఆలయానికి వెళ్లి 800 గ్రాముల గోధుమలు మరియు 800 గ్రాముల బెల్లం దానం చేయండి. దీంతో విష్ణుమూర్తి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.
>> మీరు ఎంత కష్టపడినా ప్రభుత్వం ఉద్యోగం రాలేదా.. అయితే ఇంటర్వ్యూకి ఇంటి నుండి బయలుదేరేటప్పుడు దారిలో ఆవుకి రోటీ మరియు బెల్లం తినిపించండి. దీంతో మీరు కోరుకున్నది జరుగుతుంది.  
>> మీకు డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే... గురువారం సూర్యాస్తమయం తర్వాత అరటి చెట్టు దగ్గర రూపాయి లేదా ఐదు రూపాయల నాణెం మట్టిలో కప్పెట్టండి. దీంతో లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తుంది.  


Also Read: Laxmidevi Mantralu: ఈ పవర్ పుల్ మంత్రాలు పఠించండి... ధనవంతులు అవ్వండి! 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook