Laxmidevi Mantralu: ఈ పవర్ పుల్ మంత్రాలు పఠించండి... ధనవంతులు అవ్వండి!

Laxmidevi Mantralu: లక్ష్మీదేవి అనుగ్రహం ఉండే బిచ్చగాడైనా సరే బిలియనీర్ అవుతాడు. అలాంటి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోడానికి జ్యోతిష్యశాస్త్రంలో కొన్ని మంత్రాలు చెప్పబడ్డాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 21, 2022, 11:06 AM IST
Laxmidevi Mantralu: ఈ పవర్ పుల్ మంత్రాలు పఠించండి... ధనవంతులు అవ్వండి!

Laxmidevi Mantralu: సంపదలకు అధిదేవత లక్ష్మీదేవి. ఈదేవత అనుగ్రహం ఉంటే డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడానికి ఆస్ట్రాలజీలో (Astrology) ఎన్నో  చిట్కాలు చెప్పబడ్డాయి. ఇందులో ఒకటి మంత్రాలను పఠించడం. లక్ష్మీదేవి మంత్రాలను (Laxmidevi Mantralu) జపించడం వల్ల జీవితంలో దేనికీ లోటు ఉండదు. మన ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు దూరమవుతాయి. అటువంటి ప్రభావవంతమైన లక్ష్మీదేవి మంత్రాల గురించి తెలుసుకుందాం. 

మహాలక్ష్మి మంత్రం: మీకు అప్పులు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ మంత్రాన్ని జపించండి. 'ఓం శ్రీ హ్రీం శ్రీ కమలే కమలయే ప్రసీద్ ప్రసీద్ ఓం శ్రీ హ్రీం శ్రీ మహాలక్ష్మ్యే నమః'. ఇలా చేయడం వల్ల అప్పుల బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. తామరపూలతో ఈ మహాలక్ష్మి మంత్రాన్ని పఠించండి.

లక్ష్మీ బీజ్ మంత్రం: మిమ్మిల్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినట్లయితే.. ఈ మంత్రాన్ని పఠించండి. 'ఓం హ్రీం శ్రీ లక్ష్మీభ్యో నమ' అనే మంత్రాన్ని జపించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. దీని ద్వారా మీ బాధలన్నీ తొలగిపోతాయి.తామరపూలతో లక్ష్మీ బీజ మంత్రాన్ని జపించడం శుభప్రదం. 

లక్ష్మీ గాయత్రీ మంత్రం: మీ జీవితం దుఃఖంతో నిండిపోయినట్లయితే.. ఈ మంత్రాన్ని జపించండి. 'ఓం శ్రీ మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణు పత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఓం'. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సర్వ దుఃఖాలు తొలగిపోతాయి.  

Also Read: Thursday remedies: డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే.. గురువారం ఈ పరిహారాలు చేయండి!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News