Tirumala Srivani Tickets: శ్రీవారి భక్తులకు షాక్, శ్రీవాణి టికెట్లు భారీగా కుదింపు, రోజుకు 150 టికెట్లే
Tirumala Srivani Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు షాకింగ్ న్యూస్ ఇచ్చింది టీటీడీ. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల కోటాను గణనీయంగా తగ్గించేసింది. పూర్తి వివరాలు మీ కోసం..
తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్ధం టీటీడీ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటోంది. కొన్ని నిర్ణయాల్లో మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగానే శ్రీవాణి టికెట్ల కోటాను భారీగా తగ్గించింది. రోజుకు కేవలం 150 టికెట్లకే అనుమతి ఉంటుంది. మరోవైపు ఇవాళ్టి నుంచి ఆఫ్‌లైన్ బుకింగ్ కూడా ప్రారంభమైంది.
తిరుమల శ్రీవారి శ్రీవాణి టికెట్ల కోటా లేదా టికెట్ల అమ్మకం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి టికెట్ల కోటాను భారీగా తగ్గించేసింది. రోజుకు రెండున్నర వేల టికెట్లను జారీ చేయగా, ప్రస్తుతం రోజుకు 150 టికెట్లకే పరిమితం చేసింది. బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఇదే బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు ఆఫ్‌లైన్ టికెట్ బుకింగ్ కౌంటర్‌ను డిసెంబర్ 29,2022 నుంచి మూసివేసింది. ఇప్పుడు భక్తుల నుంచి వస్తున్న అభ్యర్ధనల్ని దృష్టిలో ఉంచుకుని..శ్రీవాణి దర్శన టికెట్లను ఆఫ్‌లైన్‌లో తిరిగి ప్రారంభించింది. కానీ రోజుకు 150 టికెట్లే పరిమితం చేసింది. మార్చ్ నుంచి రోజుకు 400 టికెట్లకు పెంచుతామని వెల్లడించింది. మరోవైపు ఎయిర్‌పోర్టులో రోజుకు 250 టికెట్లు విక్రయిస్తుండగా ఆ సంఖ్యను 100 టికెట్లకు కుదించింది.
మరోవైపు తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్ట్‌మెంటుల్లో భక్తులు భారీగా నిరీక్షిస్తున్నారు. టోకెన్ లేని భక్తులకు 14 గంటల్లో దర్శనం కలుగుతోంది. ఇక తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను మార్చ్, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఇవాళ విడుదల చేసింది. ఇందులో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ ఉన్నాయి. మార్చ్, ఏప్రిల్, మే నెలలకు చెందిన ఆర్జిత సేవా టికెట్లకై ఆన్‌లైన్ లక్కీడిప్ రిజిస్ట్రేషన్ ఇవాళ ప్రారంభమైంది. ఈ నెల 24వ తేదీ వరకూ ఉంటుంది.
తిరుమలలో నిన్న అంటే ఫిబ్రవరి 21వ తేదీన 53,755 మంది శ్రీవారిని దర్శించుకోగా, 18,267 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.74 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.
Also read: March Planet Transit: గ్రహాల గోచారంతో ఆ 5 రాశులకు కొత్త ఉద్యోగాలు, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook