TTD: తిరుమల దర్శనంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో తీసుకొచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచిస్తోంది. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్, ఆటోమేషన్ వ్యస్థలు ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే స్వామి దర్శనానికి క్యూలైన్ నిరీక్షణ ఉండదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుమల శ్రీవారి దర్శనంలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. దీనికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ ఎంట్రీ విధానం పరిశీలిస్తున్నారు. ముందు ఫేస్ ఆధారంగా టోకెన్ జనరేట్ చేస్తారు. ఆ తరువాత ఫేసియల్ రికగ్నిషన్ బ్యారియర్ గేట్ ముందు నిలబడితే చాలు వాటంతటవే తెర్చుకునేలా ఏర్పాట్లు ఉంటాయి. ఈ విధానం ఆన్‌లైన్‌లో పనిచేస్తుంది. దాంతో సరిగ్గా నిర్ణీత సమయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకోవచ్చు. గంటల తరబడి క్యూలైన్ నిరీక్షణ తప్పుతుంది. కేవలం గంట లేదా గంటన్నర వ్యవధిలోనే స్వామి దర్శనం పూర్తవుతుంది. దీనికోసం ఆటోమేషన్ వ్యవస్థను వసతి బుకింగ్, దర్శనంలో అమలు చేయవచ్చు. సీసీ కెమేరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్యూలైన్ సమాచారం తెలుసుకుని నిర్ణీత సమయానికి వెళ్లి దర్శనం చేసుకునే సౌలభ్యం ఉంటుంది. టోకెన్ జనరేషన్‌లోనే తేదీతో పాటు సమయం కూడా ఉంటుంది. 


ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే భక్తులిక గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాధారనాలతో రియల్ టైమ్ అప్‌డేట్స్ తెలుసుకుని దర్శనానికి వెళ్లవచ్చు. ఇందులో భాగంగానే టీటీడీ ఇప్పటికే విజన్ 2047 విడుదల చేసింది. తిరుమల పవిత్రతకు భంగం కలగకుండా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, భక్తుల సౌకర్యాలు, సేవలపై దృష్టి సారంచనుంది. తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సౌకర్యాలు కూడా మెరుగుపర్చనున్నారు. ప్రయాణీకుల అవసరాన్ని బట్టి సాంకేతికతను అందుబాటులో తీసుకురానున్నారు. 


Also read: Cyclone Alert: ఏపీకు తుపాను ముప్పు, ఈ జిల్లాల్లో ఇక భారీ వర్షాలు తప్పవు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.