COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Today 16 October Navratri 2nd day Lucky Zodiac Signs: ఈ రోజు శారదీయ నవరాత్రుల్లో రెండవ రోజు..అమ్మవారు ఈ రోజు బ్రహ్మచారిణి అవతారంలో దర్శనమిస్తుంది. అన్ని అవతారాల్లో బ్రహ్మచారిణి అవతారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా కొన్ని రాశులవారిపై దుర్గామాత అనుగ్రహం కూడా లభించబోతోంది. దీని కారణంగా వ్యక్తిగత జీవితంలో మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అమ్మ అనుగ్రహం ఈ రోజు ఏయే రాశులవారికి లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
మేష రాశి:

ఈ రోజు మేష రాశి వారికి చంద్రుని అనుగ్రహం లభించబోతోంది. కాబట్టి ఎప్పటి నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా వృత్తిపరంగా, వ్యాపారాల పరంగా అన్ని అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో పాత వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం పొందుతారు. ఇతరులకు సహాయం చేయడం వల్ల సమాజంలో గౌరవం లభిస్తుంది.


మిథున రాశి:
మిథున రాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు వీరు వ్యాపారాలు విస్తరించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల మద్దతు లభించి పదోన్నతులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ సమయంలో సులభంగా ఉద్యోగాలు లభిస్తాయి. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


సింహ రాశి:
సింహ రాశి వారికి కూడా దుర్గామాత ఆశీస్సులు లభించబోతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఎదుర్కొంటున్న కష్టాలు సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుతంది. ఆగిపోయిన ప్రాజెక్ట్‌లు ఈ సమయంలో ప్రారంభమవుతాయి. దీంతో పాటు ఈ సమయంలో వీరు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 


కుంభ రాశి:
కుంభ రాశి వారికి ఈ రోజు చంద్రుని అనుగ్రహం లభిస్తుంది. దీంతో వీరు వ్యాపారాల్లో అనుకున్న లాభాలు పొందుతారు. అంతేకాకుండా ప్రాజెక్ట్‌లు సులభంగా పూర్తి చేసి మంచి విజయాలు సాధిస్తారు. దీంతో పాటు వీరికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అన్నదమ్ముల మధ్య కొనసాగుతున్న వివాదాలు ఇప్పుడు పరిష్కారమవుతాయి. ఇక ఉద్యోగాలు చేస్తున్నవారు ప్రమోషన్స్‌ కూడా పొందుతారు. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..