Hanuman jayanthi-Zodiac Signs: నిత్య జీవితంలో చాలామందికి జ్యోతిష్యం అంటే నమ్మకం ఎక్కువ. ప్రతిరోజూ తమకెలా ఉందో తెలుసుకునే ఆసక్తి ఉంటుంది. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి (Aries)


ఈ రాశివారికి ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధి కలుగుతుంది. ఆస్థిలాభముంటుంది. ప్రముఖులతో పరిచయాలు అనుకూలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. 


వృషభరాశి ( Taurus)


ఈ రాశివారికి అంతా ప్రతికూలమే. ఆర్ధిక ఇబ్బందులు, కొత్త రుణాలు తప్పవు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధుమిత్రులతో విరోధముంటుంది. ఉద్యోగ, వ్యాపారాలు క్షీణిస్తాయి.


మిధునరాశి ( Gemini) 


ఈ రాశివారి పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఉద్యోగ , వ్యాపారాలు మోస్తరుగా ఉండి..ఆదాయనికి మించి ఖర్చులు ఎదురౌతాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగం సాధారణంగానే ఉంటుంది.


కర్కాటకరాశి ( Cancer) 


ఈ రాశివారికి అంతా అనుకూలమే. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు లభిస్తాయి. పరిచయాలు పెరిగి..ప్రయోజనం చేకూరుతుంది. 


సింహరాశి (Leo) 


ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపారం కాస్త ఫరవాలేదు. మోస్తరుగా ఉంటుంది. ఉద్యోగంలో కాస్త ఇబ్బంది తప్పదు. కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది. 


కన్యారాశి ( Virgo)


ఈ రాశివారికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగ, వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. కుటుంబసభ్యులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. 


తులారాశి ( Libra)


ఈ రాశివారికి పూర్తిగా ప్రతికూల పరిస్థితులుంటాయి. ఆరోగ్యం కావచ్చు, ఆర్ధికం కావచ్చు అంతా నష్టమే. బంధుమిత్రులతో వివాదం ఏర్పడుతుంది. కుటుంబసభ్యులతో పరిస్థితి బాగుండదు. ఉద్యోగ, వ్యాపారాల్లో నష్టమేర్పడుతుంది. 


వృశ్చికరాశి ( Scorpio)


ఈ రాశివారికి అంతా సానుకూలంగా ఉంటుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా ఉంటారు. ఉద్యోగ, వ్యాపారాలు బాగుండటమే కాకుండా ఆర్ధికంగా బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఏ విధమైన సమస్యలు తలెత్తవు.


ధనస్సురాశి  ( Sagittarius) 


ఈ రాశివారికి కూడా పరిస్థితి అనుకూలమే. కుటుంబసభ్యులతో బాగుంటుంది. ఆనందంగా ఉంటారు. ఆరోగ్యపరంగా సమస్యలుండవు. ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి. పాత బాకీలు వసూలవుతాయి.


మకరరాశి ( Capricorn)


ఈ రాశివారికి ఇవాళ ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. బంధుమిత్రులతో ముఖ్యంగా వివాదాలు తలెత్తవచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు తప్పవు. చేయాల్సిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. 


కుంభరాశి  ( Aquarius) 


ఈ రాశివారి పరిస్థితి కూడా ప్రతికూలమే. అన్నింట్లో ఇబ్బందులు తప్పవు. ఆ ఇబ్బందుల కారణంగా కొన్ని పనులు వాయిదా వేయాల్సి వస్తుంది. సన్నిహితులు, బంధుమిత్రులతో విభేధాలు తప్పవు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి ఎక్కువౌతుంది. 


మీనరాశి ( Pisces)


ఇవాళ మిశ్రమ ఫలితాలు ఎదురౌతాయి. ఏదో ఒక పనికై ఇన్నాళ్లు పడిన శ్రమకు మంచి ఫలితం లభిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయమేర్పడి..అనుకూలంగా ఉంటుంది. చేయాల్సిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబసభ్యులతో ఆనందంగా ఉంటారు. 


Also read: Zodiac signs Nature: ఈ రాశుల పిల్లలకు సాధ్యం కానిదంటూ ఉండదట తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook