Zodiac signs Nature: ఈ రాశుల పిల్లలకు సాధ్యం కానిదంటూ ఉండదట తెలుసా

Zodiac sign Nature: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిపుణలు.. భవిష్యత్ అంచనాలతో పాటు.. ఏ రాశి వారి స్వభావం ఎలా ఉంటుంది? ఏఏ రాశుల వారిలో ఎలాంటి టాలెంట్స్ ఎక్కువగా ఉంటాయి? ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 15, 2022, 05:37 PM IST
  • జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పిల్లల స్వభావం
  • రాశుల వారీగా ఒక్కొక్కరిలో ఒక్కో లక్షణం
  • వివిధ రాశుల పిల్లల్లో తెలివితేటలు అమోగం
Zodiac signs Nature: ఈ రాశుల పిల్లలకు సాధ్యం కానిదంటూ ఉండదట తెలుసా

Zodiac sign Nature: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశులను బట్టి వారి స్వభావాలు చెబుతుంటారు నిపుణులు. స్వభావాల పరంగా చూస్తే.. కొంత మంది నిజాయితీగా ఉంటే.. మరికొందరిలో పాటలు పాడటం, కొత్త విషయాలు తెలుసుకోవడం వంటి తెలివితేటలు ఉంటాయి. ఇలా రాశుల వారీగా పిల్లల్లో ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుంది? ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి

ఈ రాశికి చెందిన పిల్లలు ఎల్లప్పుడు సొంత గుర్తింపుకోసం పరితపిస్తుంటారు. తమ కలలు నెరవేర్చుకునేందుకు రాత్రి, పగలు అనే తేడా లేకుండా కష్టపడుతుంటారు. ఈ ప్రయత్నంలో భయం, నిరాశ వంటిని జయించేందుకు కృషి చేస్తారు అని తెలిసింది.

వృషభం

ఈ రాశి పిల్లల్లో ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. తాము అనుకున్నది కచ్చితంగా సాధించాలనే పట్టుదల కనిపిస్తుంది. ఏ విషయంలోనైనా ముందుడేందుకు ప్రయత్నిస్తుంటారు. వీరిలో పోటీ తత్వం ఎక్కువగా ఉంటుంది.

తులారాశి

తుల రాశికి చెందిన పిల్లలు చాలా చురుగ్గా ఉంటారు. ఆటలు, పాటలు, చదువు ఇలా అన్నింటిలో ముందు వరుసలో ఉంటారు. పోటీ అంటే ఈ రాశి పిల్లలకు బాగా ఇష్టం. పోటీ పడాల్సి వస్తే అందులో నెగ్గేందుకు సర్వ శక్తులను ఒడ్డుతారు. అంతే కాదు ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఇష్టపడుతుంటారు.

వృశ్చికరాశి

వృశ్చికరాశి పిల్లల్లో కూడా చాలా తెలివితేటలు ఉంటాయి. అంతే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా ఈ రాశి పిల్లలు ఓటమిని అంత సులువుగా ఒప్పుకోరు. అంతే కాకుండా తమకు ఏదీ అసాధ్యం కాదు అనే పట్టుదలతో ఉంటారు. మరో విశేషం ఏమిటంటే.. ఈ రాశి పిల్లలు ఏదైనా పనిలో విజయం సాధించేందుకు ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా స్వీకరిస్తారట.

నోట్​: ఈ కథనంలోని సమాచారం పూర్తిగా జ్యోతిష్య నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. ఇందులోని అంశాలను ZEE తెలుగు NEWS ధ్రువీకరించలేదు.

Also read: Saturn Transit 2022: కుంభ రాశిలోకి శని సంచారం... ఈ 3 రాశుల వారికి పట్టిన శని పీడ ఇక వదిలినట్లే..

Also read: Hanuman Janmotsav 2022: 'హనుమాన్ జయంతి' అనొద్దు.. 'హనుమాన్ జన్మోత్సవం' అనాలి.. ఎందుకంటే...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News