Horoscope Today 06 June 2021: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి ఓ ప్రత్యేక లక్షణం ఉంటుంది. శ్రీ ప్లవ నామ సంవత్సరం జూన్ 06వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
ఇంటి సమస్యలు పరిష్కారమవుతాయి. చిన్నారుల ఆరోగ్యం మెరుగవుతుంది. కానీ ఉద్యోగులకు పని విషయానికి వస్తే చాలా కష్టంగా మారుతుంది. చాలా తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తి చేయాలని మీపై ఒత్తిడి చేస్తారు. ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కొందరు మిత్రులు మిమ్మల్ని కలుసుకుంటారు. 


వృషభ రాశి
చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పెట్టుబడుల పరంగా నేడు పరిస్థితులు మీకు అనుకూలం.  అయితే నూతన పెట్టుబడులకు ఇది తగిన సమయం కాదని కొందరు సలహా ఇస్తారు. కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. ప్రయాణాల కారణంగా ఖర్చులు అధికం కానున్నాయి.


Also Read: Hanuman Jayanthi 2021 Date: తిరుమలలో నేటి నుంచి 5 రోజులపాటు హనుమాన్‌ జయంతి ఉత్సవాలు


మిథున రాశి
చర్చించడం ద్వారా ఇంట్లో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పనిచేసే చోట ఉన్నత స్థాయి అధికారులు మీకు ప్రమోషన్ ఇవ్వవచ్చు. విద్యార్థులు ఉన్నత విద్య ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. .


కర్కాటక రాశి 
గత కొన్ని రోజులుగా మీ వ్యవహారాలు ముందుకు సాగవు. ఈరోజు ఆనందం మరియు ప్రేమను పొందుతారు. గతంలో మీతో రిలేషన్ ఉన్న వ్యక్తులు ఓ సందేశాన్ని పంపుతారు. మీరు కెరీర్‌పై భవిష్యత్తుపై దృష్టిసారించాలని సన్నిహితులు సలహా ఇస్తారు. వ్యాపారులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.


సింహ రాశి
మీ జీవిత భాగస్వామితో ఇంట్లో తలెత్తిన సమస్యలు పరిష్కారం అవుతాయి. వాహనాలు కొనుగోలు చేయాలని భావిస్తే, అందుకు నేడు తగిన సమయం. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి కుటుంబసభ్యులతో సరదాగ గడపాలనుకుంటారు. ఖర్చుల కారణంగా కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు.


Also Read: Lunar Eclipse 2021: చంద్ర గ్రహణం ఈ రాశుల వారిపై ప్రభావం చూపుతుంది


కన్య రాశి
కొన్ని పనులు మధ్యలోనే వాయిదా పడతాయి. శుభకార్యాలు నిర్వహించాలని నిర్ణయించుకుంటారు. జంటలు కొత్త కాపురాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ రోజు పని సజావుగా ఉంటుంది మరియు మీ సహోద్యోగులు మీ ప్రయత్నాలను అభినందిస్తారు. వ్యాపారుల అంచనా తప్పుతుంది.


తులా రాశి
మీరు కొంతకాలంగా ప్రేమ కోసం చూస్తున్నట్లయితే, నేడు ఆ వ్యక్తిని కలుసుకుంటారు. శుభవార్తలు చెవిన పడతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. మీ పనులను ఈ రోజు సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయడం మంచిది. గృహం కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తారు.


వృశ్చిక రాశి
పని నుంచి కాస్త విరామం తీసుకుని ఇంటి గురించి ఆలోచించండి. కుటుంబ సభ్యులతో చాలా రోజుల తరువాత సరదాగా సమయాన్ని గడుపుతారు. సృజనాత్మక రంగంలో కొత్త నైపుణ్యాన్ని ఎంచుకుంటారు. ఇది మీ కెరీర్‌లో మీకు సహాయపడుతుంది. కొత్త ఇల్లు డిజైన్ కోసం నేడు మీరు బిజీగా ఉంటారు.


ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి నేడు ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. గతంలో చేసిన పెట్టుబడులు కొన్ని నష్టాలను కలిగించవచ్చు. మీ పిల్లల సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు నేడు సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ ఉన్నతాధికారులు మీకు మరింత బాధ్యత మరియు ప్రధాన స్థానాన్ని ఇస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఖర్చులు అధికం కానున్నాయి.


మకర రాశి
ఆలోచనాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం . కనుక విద్యపై దృష్టిసారించాలని సలహా ఇస్తారు. మీ ఆనందం ఈ రోజు అన్ని వేళలా ఉంటుంది. ఉద్యోగలుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. కొరుకున్న ప్రమోషన్ లేదా కొత్త పాజిషన్ లభిస్తుంది. నేడు మీరు రెట్టింపు శ్రమించాల్సి వస్తుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి.


కుంభ రాశి
నేడు మీరు ఇంటికి మరియు కుటుంబానికి సంబంధించిన పనులు, కార్యక్రమాలతో తీరిక లేకుండా గడుపుతారు. పిల్లల అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ తల్లిదండ్రులతో సైతం మీ బంధం బలపడుతుంది. నేడు మీకు వస్తులాభాలు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరగడంతో ఆలయాలు సందర్శిస్తారు.


మీన రాశి
నూతన కార్యక్రమాలు చేపట్టడానికి పెద్దలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీరు ప్రయాణం చేయాలని చూస్తున్నట్లయితే, ప్రస్తుతం అలా చేయకపోవడమే మంచిది. మీ కెరీర్‌పై దృష్టిసారిస్తారు. ఆధ్యాత్మిక జీవనం వైపు అడుగులు వేస్తారు. ఖర్చులు అధికం కానున్నాయి. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగులు మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook