Today Horoscope January 2023 Rashifal: ఈ నెలలో చాలా గ్రహాలు సంచారంలో దశలో ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో అన్ని రాశులవారిపై ప్రభావం పడే అవకాశాలున్నాయి. అయితే ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సంచారం దశలో పలు రాశులవారు అధికంగా లాభాలు పొందితే మరికొన్ని రాశులవారు ఊహించని స్థాయిలో నష్టపోతారని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్ని రాశులవారిపై ఈ రోజు ప్రభావం పడనుంది. ఏయే రాశులవారు ఈ క్రమంలో ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రహాల స్థానాలు:
మేషరాశిలో రాహువు.. వృషభరాశిలో కుజుడు.. తులారాశిలో కేతువు.. చంద్రుడు వృశ్చిక రాశిలో సంచార దశలో ఉన్నాడు. బుధుడు ప్రత్యక్షంగా ధనుస్సు రాశిలో సంచరించనున్నాడు. మకరరాశిలో సూర్యుడు, శుక్రుడు, కుంభరాశిలో శని, మీనరాశిలో కుజుడు సంచరించనున్నాడు. దీంతో ఈ ప్రభావం అన్ని రాశులవారిపై పడే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


మేష:
మేష రాశివారికి ఈ రోజు రేపు చాలా రకాల దుష్ర్ఫభావాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి వీరు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే వ్యాపారాల పరంగా చూసుకుంటే ఈ రాశివారికి రేపు చాలా లాభాలు పొందుతారు. అయితే చెడు ప్రభావాల నుంచి దూరంగా ఉండడానికి తప్పకుండా సూర్యభగవానున్ని పూజించాల్సి ఉంటుంది.  


వృషభం:
వృషభం రాశివారికి ఈ రోజు నంచి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా వ్యాపారాలు కూడా బాగా నడుస్తాయి. కాబట్టి వీరు తప్పకుండా ఆకుపచ్చని వస్తువులను దానం చేయడం వల్ల ఇంకా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు.


మిథునం:
మిథున రాశివారికి కూడా ఈ క్రమంలో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ శత్రువులపై భారం పడే అవకాశాలున్నాయి. ప్రేమ సంబంధాలు మెరుగుపడడమే కాకుండా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాలు కూడా సక్రమంగా కొనసాగుతాయి.


సింహం:
ఈ రోజు రేపు సింహ రాశివారికి ఆరోగ్యం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా భౌతిక ఆనందం రెట్టింపు అవుతుంది. కాకపోతే తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


Also Read: Tax Saving Schemes 2023: ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి.. ఆదాయంతోపాటు సూపర్ బెనిఫిట్స్   


Also Read: Shubman Gill: ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన.. చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి