Today Horoscope July 25 2022: మేషం ( Aries): శుభకాలం నడుస్తోంది. మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. మనోధైర్యంతో చేసే పనులు ఫలిస్తాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారి పరిస్థితి మెరుగుపడుతుంది. ఇష్టమైన వారితో సరదా కాలాన్ని గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి మాటాడాల్సి ఉంటుంది. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం మంచిది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): అన్ని రంగాల వారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు.  ఆర్థిక అభివృద్ధి ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. విహారయాత్ర వెళ్లే అవకాశం ఉంది. కుటుంబంతో విలువైన సమయాన్ని గడుపుతారు. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.


మిథునం (Gemini): చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అదిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకండి. డబ్బు ఇవ్వడంలో చాలా కఠినంగా ఉండకండి, ఎందుకంటే ఆ తర్వాత పశ్చాత్తాపపడవచ్చు. ప్రయాణం చేయడానికి ఇది మంచి రోజు. గురు, శని ధ్యానం మంచి ఫలితాలను ఇస్తుంది.


కర్కాటకం (Cancer): శుభకాలం నడుస్తోంది. అనుకూల ఫలితాలు ఉన్నాయి. నూతన పనులను ప్రారంభిస్తారు. ఊహించని శుభవార్తలు వింటారు. కుటుంబంలో పెళ్లి వార్త వినిపించే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వచనాలు దక్కుతాయి. బంధువుల వ్యవహారాలలో తలదుర్చ రాదు. కొన్ని ఊహించని ఖర్చులు మీ బడ్జెట్‌కు భంగం కలిగించవచ్చు. ప్రయాణాలు చేస్తారు. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.


సింహం (Leo): మునుపటి పెట్టుబడులు మీకు కలిసొచ్చే అవకాశం ఉంది. స్థిరమైన నిర్ణయాలతో అనుకూల ఫలితాలను అందుకుంటారు. తోటివారి సహకారాలు అందుతాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. మీరు ఎప్పటినుంచో కోరుకునే ప్రదేశాన్ని సందర్శించే అవకాశం వస్తుంది. శ్రీ విష్ణు నామాన్ని పఠించడం మంచిది. 


కన్య (Virgo): ఆర్ధిక రంగంలోని వారికి కలిసొచ్చే కాలం. మంచి ఫలితములను పొందుతారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రయత్నాలను ఉన్నతాధికారులు అంగీకరించే అవకాశం ఉంది. మీ జీవనశైలికి సరిపోయే వ్యాయామ నియమాన్ని కొనసాగించడం మంచిది. ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం శుభప్రదం.


తుల (Libra): ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. చేపట్టే పనుల్లో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడాలి. అనవసర ఖర్చులను అదుపు చేయండి. విహారయాత్రను ఆనందించవచ్చు. వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది.


వృశ్చికం (Scorpio): ఆర్థిక అనిశ్చితి నుంచి బయటపడి స్థిరత్వాన్ని సాధించగలుగుతారు. మార్కెట్ అనుకూలంగా ఉన్నందున రిటైలర్లు తమ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది. తలపెట్టిన కార్యాలను మనోధైర్యంతో పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఇష్టదైవ ప్రార్థన శుభాన్నిస్తుంది.


ధనస్సు (Sagittarius): ఆర్థిక రంగంలోని వారికి కలిసొచ్చే కాలం. ముఖ్య విషయాల్లో ఓర్పుతో ఉండాలి. పాత అనారోగ్యానికి కొత్త చికిత్స పని చేసే అవకాశం ఉంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. దైవబలం మిమ్మల్ని రక్షిస్తున్నది. సుదీర్ఘ ప్రయాణం బోరింగ్‌గా ఉండవచ్చు. ఆస్తి విషయంలో సానుకూల పరిణామాలు ఉన్నాయి. సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం.


మకరం (Capricorn): కలిసొచ్చే కాలం. ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోబలంతో ముందుకు సాగండి. కుటుంబంలో ఒకరికి పెళ్లి సంబంధం వచ్చే అవకాశం ఉంది. ఎవరితోనూ గొడవలకు పోరాదు. ఇష్టదైవ ప్రార్థన మంచిది.


కుంభం (Aquarius): మీరు చేసే అన్ని ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మంచి మనస్సుతో చేసే పనులు ఫలితాలను ఇస్తాయి. ఆర్థికంగా కలిసొచ్చే కాలం. గౌరవం పెరుగుతుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖసంతోషాలతో గడుపుతారు. కుటుంబ విహారయాత్రను ప్లాన్ చేయవచ్చు. వారసత్వం ద్వారా మీకు స్థిరమైన ఆస్తి రావచ్చు. వినాయకుని ఆరాధన మేలు చేస్తుంది.


మీనం (Pisces): అనుకూల సమయం నడుస్తోంది. వృత్తిపరంగా సంతృప్తికరమైన రోజు. పనిలో తోటి వారి సహాయసహకారాలు అందుతాయి. అందరి మన్ననలను పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితులు, బంధువుల కలయిక ఈరోజు మిమ్మల్ని ఆనందంగా ఉంచుతుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.


Also Read: కళ్లకు కాటుక పెట్టి.. నాభి అందాలతో పైకెప్పిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ దివి వైద్య!


Also Read: 190 రన్స్ వద్ద పడిన టెన్షన్.. 390లలో ఉన్నప్పుడు కూడా పడలేదు: సామ్   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.