Horoscope Today June 27 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రెండు రాశుల విద్యార్థులకు శుభకాలం!
Daily Astrological prediction for June 27 2022. వృశ్చికం, కుంభ రాశుల వారికి శుభకాలం నడుస్తోంది. ఈ రాశుల వారి రాశుల విద్యార్థులకు శుభకాలం నడుస్తోంది.
Today Horoscope June 27 2022: మేషం ( Aries): కష్టానికి తగిన ఫలితం ఉంది. మనోధైర్యంతో ప్రయత్నించి చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. ఈరోజు పనిలో కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంది, కాబట్టి అప్రమత్తంగా ఉండండి. బంధుమిత్రులను కలుస్తారు. ఇల్లు కోసం ఒక ప్రధాన వస్తువును కొనుగోలు చేస్తారు. చంద్రశేఖరాష్టకాన్ని చదివితే మంచిది.
వృషభం (Taurus): అదనపు పని చేయాల్సి ఉంటుంది. అధిక ధనలాభం ఉంది. ఒక విషయంలో సంతోషాన్ని పొందుతారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. కొంత కాలంగా అనారోగ్యంగా ఉన్నవారు కోలుకునే అవకాశం ఉంది. మంచి సలహా కుటుంబ సభ్యులకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.
మిథునం (Gemini): మిశ్రమ కాలం నడుస్తోంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించాలి. నూతనంగా చేపట్టే పనులలో ఆటంకాలు ఉన్నాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
కర్కాటకం (Cancer): ఆర్థిక ఇబ్బందులు త్వరలో తీరే అవకాశం ఉంది. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సన్నిహితులు మరియు ప్రియమైన వారితో ప్రయాణం సరదాగా ఉంటుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని కీలక నిర్ణయాలలో వారి సహకారం మీకు లబిస్తుంది. వేంకటేశ్వరుడిని పూజిస్తే బాగుంటుంది.
సింహం (Leo): వ్యాపార రంగంలోని వారు డబ్బును సరైన మార్గంలో ఉపయోగించుకోవాలి. పనిలో మీ సహనాన్ని పరీక్షించే పరిస్థితి ఏర్పడవచ్చు. మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ వివాదం తలెత్తవచ్చు. వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి. వ్యాపార పర్యటనలో ఉన్నవారు కొన్ని శుభవార్తలతో తిరిగి వచ్చే అవకాశం ఉంది. శివారాధన మేలు చేస్తుంది.
కన్య (Virgo): ప్రస్తుత ద్రవ్య పరిస్థితి మిమ్మల్ని ఉల్లాసమైన మూడ్‌లో ఉంచుతుంది. ఆత్మ శుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. ఆరోగ్య సమస్యకు చెక్ పెట్టె అవకాశం ఉంది. తరుచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంద. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
తుల (Libra): ధనపరంగా మీరు అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి. మీరు మీటింగ్ లేదా సెమినార్‌లో మీ ఉనికిని చాటుకునే అవకాశం ఉంది. కలహ సూచన ఉంది. విహారయాత్రకు ప్లాన్ చేసుకునే వారు హిల్ స్టేషన్‌ను ఎంచుకోవచ్చు. ఆస్తి విషయంలో తగాదాలు ఉన్నవారు సామరస్యంగా పరిష్కారం పొందుతారు. శని శ్లోకం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
వృశ్చికం (Scorpio): ఓ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టి డబ్బును కోల్పోవచ్చు. కొందరు తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఒక ముఖ్య వ్యవహరంలో ఆర్థిక సాయం అందుతుంది. ఈ రోజు మీరు మీ కుటుంబంతో గడపడానికి సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. విద్యార్థులకు శుభకాలం నడుస్తోంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
ధనస్సు (Sagittarius): ఆర్థిక రంగంలో మీ ఆస్తులు మరియు సంపదను అనేక రెట్లు పెంచే అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీలో కొందరు జీవిత భాగస్వామి షెడ్యూల్ ప్రకారం విషయాలను ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.
మకరం (Capricorn): శ్రమతో కూడిన పని చేయాల్సి ఉంది. ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మనోబలం కోసం దుర్గా అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.
కుంభం (Aquarius): మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న బకాయిలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక లాభం పొందుతారు. మీ పనితో అందరినీ ఆకట్టుకునే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్నవారు అద్భుతంగా కోలుకుంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి కలదు. విద్యార్థులకు శుభకాలం నడుస్తోంది. సంకటహర గణపతి స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.
మీనం (Pisces): ఆర్థిక పరంగా చాలా బాగుంది. శ్రద్దగా పనిచేస్తే విజయం తప్పక వరిస్తుంది. మీ స్వంత ప్రయత్నాలు ఒత్తిడిని తగ్గించడంలో మరియు మానసిక ప్రశాంతతను సాధించడంలో సహాయపడతాయి. కుటుంబంలో గొడవలు పడే అవకాశం ఉంది. దూర ప్రయాణాలకు వెళ్లేవారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్గారాధన చేస్తే మంచిది.
Also Read: E Passports: త్వరలో ఇండియాలో ఇ పాస్‌పోర్ట్‌లు జారీ, ఎలా పనిచేస్తాయంటే
Also Read: Telangana Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై వీడిన ఉత్కంఠ..28న ఫలితాలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి