Horoscope Today May 23 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఇల్లు కొనాలని చూస్తున్న ఆ రాశుల వారికి శుభకాలం!
Daily Astrological prediction for May 23 2022. ధనస్సు, కుంభ రాశుల వారికి మంచి కాలం నడుస్తోంది. ఈ రెండు రాశుల వారు ఇల్లు కొనుగోలు విషయంలో మంచి బేరం లభిస్తుంది.
Today Horoscope May 23 2022: మేషం ( Aries): శుభకాలం నడుస్తోంది. ఆర్థికంగా సురక్షితంగా ఉండటానికి మంచి మార్గాలు ఉన్నాయి. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచింది. ఫిట్‌నెస్‌ను సాధించడంలో ఆరోగ్యం విషయంలో ఎవరి సలహా అయినా ఉపయోగపడుతుంది. ఇష్టదైవారాధన చేయండివృషభం (Taurus): లావాదేవీలలో జాగ్రత్త అవసరం. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. సెలవుల కోసం కుటుంబం మీపై ఒత్తిడి తెస్తుంది. కొత్త డ్రైవర్లు రోడ్డుపై జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మికత మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. దుర్గాదేవి ధ్యానం మేలు చేస్తుంది.
మిథునం (Gemini): అత్యవసరమైన పనిని పూర్తిచేయడానికి శ్రమించాల్సి ఉంటుంది. కీలక వ్యహారాల్లో ఓర్పు, పట్టుదల అవసరం. అవసరానికి మించిన ఖర్చులుంటాయి. ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రాబడులు వస్తాయి. నవగ్రహ ఆలయ సందర్శనం శుభదాయకం.
కర్కాటకం (Cancer): అనుకోని సంపద దరిచేరే అవకాశం ఉంది. కీలక వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇంటి కొనుగోలు విషయంలో ఆటంకాలు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. దైవారాధన మానవద్దు.
సింహం (Leo): కొత్తగా ఆరంభించే పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. కొన్ని పనులు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కీలక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కుటంబంతో కలిసి ఓ వేడుకలో పాల్గొంటారు. వేంకటేశ్వర స్వామిని పూజించాలి.
కన్య (Virgo): వృత్తిపరమైన రంగంలో పురోగతిని సాధిస్తారు. మీ పనితీరు ద్వారా ఇతరులను ఆకట్టుకుంటారు. తలపెట్టిన పనుల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్యమైన విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శివస్తోత్రం పఠిస్తే మంచిది.
తుల (Libra): ఆర్థిక లాభాలు రూపుదిద్దుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. మొదలుపెట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు అవసరం. మీ జీవిత భాగస్వామికి దగ్గరవుతారు. డ్రైవింగ్ చేసేటప్పుడు వేగాన్ని అదుపులో ఉంచుకోండి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
వృశ్చికం (Scorpio): ఆర్థిక మెరుగుదల దగ్గరలోనే ఉంది. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్థుతలకు కలిసొచ్చే కాలం. అధికారులు మీకు అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకుంటారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. ప్రయాణ సూచనలు ఉన్నాయి. ప్రేమికులకు శుభకాలం. శివస్తోత్రం పఠిస్తే మంచిది.
ధనస్సు (Sagittarius): మునుపటి పెట్టుబడుల నుంచి మంచి ఆర్థిక రాబడి ఉంది. వ్యాపార రంగం వారికి శుభ ఫలితాలున్నాయి. మీ పనిలో తోటివారి సహాయం లభిస్తుంది. జీవిత భాగస్వామి ఆలోచనలకు మీ మద్దతు లభిస్తుంది. ఇల్లు కొనాలని చూస్తున్న వారికి మంచి బేరం లభిస్తుంది. దుర్గాదేవి ఆరాధన శుభదాయకం.
మకరం (Capricorn): ఆర్థిక పరంగా శుభవార్త వింటారు. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబంతో మధుర క్షణాలను గడుపుతారు. పెండింగ్‌లో ఉన్న ప్రధాన పనులు పూర్తవుతాయి. ఆస్తి కొనుగోలుకు సమయం అనుకూలంగా కనిపిస్తోంది. ఆంజనేయ స్వామి ఆరాధన ఉత్తమం.
కుంభం (Aquarius): ఇతరుల రాకతో ఆకస్మిక నష్టాన్ని చవిచూడవచ్చు. కీలక బాధ్యతలు మీ భుజానపడతాయి. మీకు కావాల్సిన పని పూర్తి చేసే అవకాశం ఉంది. మీకు కుటుంబం పూర్తి మద్దతునిస్తుంది. అందరి ప్రశంసలు పొందుతారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇల్లు కొనాలని చూస్తున్న వారికి శుభవార్త వింటారు. శివారాధన శుభప్రదం.
మీనం (Pisces): నూతనంగా చేపట్టే పనుల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. బంధువులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. సంపాదనను పెంచుకోవాలనే మీ కోరికను సరైన సమయం వరకు తాత్కాలికంగా నిలిపివేయవలసి ఉంటుంది. శివుడిని ఆరాధిస్తే మంచిది.
Also Read: Omicron: దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్స్... తమిళనాడులో బీఏ.4, తెలంగాణలో బీఏ.5 వేరియంట్ గుర్తింపు..
Also Read: Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. సింహంతోనే పరాచకాలా.. చేతి వేలిని పిప్పి చేసిన మృగరాజు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook