Janmashtami 2022: నేడే జన్మాష్టమి.. సంతానం కలగాలంటే శ్రీకృష్ణుడిని ఈ విధంగా పూజించండి!
Janmashtami 2022: శ్రీ కృష్ణుని బాల గోపాల రూపాన్ని నెలవారీ జన్మాష్టమి రోజున పూజిస్తారు. మీకు సంతానం కలగాలంటే ఈ రోజు ఉపవాసం చేయండి.
Masik Janmashtami 2022: జన్మాష్టమి పండుగను ప్రతి నెలా కృష్ణ పక్షంలోని అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. ఈ నెల జూన్ 20న ఆషాఢ మాసం జన్మాష్టమి (Masik Janmashtami 2022). ఈ రోజున, కృష్ణుడి (Lord Krishna) యొక్క బాల గోపాల రూపాన్ని పూజిస్తారు. సంతానం కావాలనుకునేవారికి ఈ రోజు చాలా పవిత్రమైన రోజు. ప్రతి నెలా జన్మాష్టమి రోజున ఉపవాసం ఉండడం వల్ల పిల్లలను లేని దంపతులకు సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఈ వ్రతాన్ని ప్రతినెలా క్రమం తప్పకుండా పాటిస్తే మేలు జరుగుతుంది.
జన్మాష్టమి తిథి, శుభ సమయం
హిందూ క్యాలెండర్ ప్రకారం, ఇవాళ అనగా జూన్ 20న జన్మాష్టమి వచ్చింది. పైగా ఇది ఆషాఢ మాసం. ఇది సోమవారం రాత్రి 09.01 గంటలకు ప్రారంభమై జూన్ 21 మంగళవారం రాత్రి 08.30 గంటల వరకు కొనసాగుతుంది.
జన్మాష్టమి ప్రాముఖ్యత
నెలవారీ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఈ రోజున శ్రీకృష్ణుని బాల రూపాన్ని పూజించడం చాలా శుభప్రదమని నమ్ముతారు. సంతానం పొందాలనుకునే దంపతులకు ఈరోజు చాలా మంచిదని భావిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం పొందడంతోపాటు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి.
Also Read: Ashadh 2022: ఆషాఢ మాసంలో డేంజర్ యోగం..! బుధవారం ఈ పరిహారాలతో మీ సమస్యలకు చెక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.