Today Horoscope: ఖగోళ శాస్త్రంలో, జ్యోతిష్యంలో ఇవాళ అంటే ఏప్రిల్ 30, 2022కు ఓ ప్రత్యేకత ఉంది. సూర్యగ్రహణంతో పాటు నాలుగు గ్రహాలు ఒకే వరుసలో రావడమనే అద్భుతం చోటుచేసుకుంది. అదే సమయంలో ఇవాళ్టి రాశి ఫలాలు  ఎవరికి అనుకూలం..ఎవరికి కాదనేది పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాశి ఫలాలు ప్రతిరోజూ చూసుకోవడం చాలామందికి అలవాటు. అందులో ఇవాళ పాక్షిక సూర్యగ్రహణం. ఈ సందర్భంగా ఏ రాశులవారికి ఇవాళ కలిసొస్తుంది, ఎవరికి కలిసి రాదనేది చూద్దాం. కొన్ని రాశులవారికి ఇవాళ పూర్తిగా అనుకూలంగా మంటే మరి కొంతమందికి మాత్రం ప్రతికూలంగా ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం..


మేషరాశివారికి గురు, శని గ్రహాల బలం ఉండటంతో ఆర్ధికంగా బాగుంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసొస్తుంది. ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. మిధున రాశివారికి కూడా అనుకూలమే. ఉద్యోగంలో మార్పు కారణంగా లాభం చేకూరుతుంది. ఆదాయం పెరగనుంది. కీలకమైన పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఇక కర్కాటక రాశివారికి సైతం ఇవాళ పరిస్థితి అనుకూలమే. ఆర్ధికంగా బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలుంటాయి. బంధమిత్రులతో మాత్రం జాగ్రత్తగా ఉండటం మంచిది. అదే సమయంలో సింహరాశివారికి పూర్తిగా సానుకూలమే. ఆరోగ్య విషయాల్లో తప్ప మిగిలిన విషయాల్లో బాగుంటుంది. ఆర్ధికంగా మెరుగ్గా ఉండటమే కాకుండా కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఇక కన్యరాశి వారికి కూడా పరిస్థితి అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసొస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు ఆర్జిస్తారు. ఇక వృశ్చిక రాశివారికి మంచిరోజే. చాలాకాలంగా ఇబ్బందులు ఎదురవుతున్నా ఇవాళ బాగుటుంది. వ్యాపారంలో, ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. ధనస్సు రాశివారు ఉద్యోగ, వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. కానీ చాలా సమస్యలకు ఇవాళ పరిష్కారం కన్పిస్తుంది. అనుకున్న పనులు సజావుగా పూర్తవుతాయి. ఇక మకర రాశివారికి పరిస్థితి పూర్తిగా బాగుంటుంది. ఉద్యోగ విషయంలో ఉండే సమస్యలు తొలగుతాయి. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కన్పిస్తుంది. కుటుంబసభ్యుల సహకారం మర్చిపోలేనిది. 


ఇక మీనరాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ఆరోగ్యంపై కాస్త ఫోకస్ అవసరం. కానీ ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలుంటాయి. ఆర్ధికంగా మెరుగైన పరిస్థితి. ఇక కుంభరాశివారికి కూడా మిశ్రమ ఫలితాలే. కొన్ని సమస్యలు దూరమైనా..ఉద్యోగ విషయంలో ఇబ్బందులు తప్పవని పండితులు చెబుున్నారు. అదే సమయంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. ఇక తుల రాశివారికి ఉద్యోగ విషయంలో ఇబ్బందులు తప్పవు. వ్యాపారంలో జాగ్రత్తగా లేకపోతే నష్టాలెదురవుతాయి. ఆర్ధికంగా మాత్రం మెరుగైన పరిస్థితే. ఇక వృషభ రాశివారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 


Also read: Surya Grahan 2022: రేపే సూర్యగ్రహణం... భారత్‌లో కనిపిస్తుందా? సూర్యుని అనుగ్రహం పొందడానికి ఇలా చేయండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.