Today Horoscope January 10 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి శుభవార్తలు అందుతాయి!!
ఈ రోజు మేష రాశివారు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు.
Today's Horoscope January 10 2022: మేషం: అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికం అవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది.
వృషభం: చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువుల, కుటుంబసభ్యుల ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. మీకు రావలసిన అవకాశాలు రాకపోవడం, పక్కవాళ్లకు రావడంతో నిరుత్సాహం వస్తుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే బాగుంటుంది.
మిథునం: నూతన కార్యాలు కాస్త ఆలస్యంగా ప్రారంభిస్తారు. అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అబద్దాలు ఆడకంటే మంచింది. అనవసర భయాందోళనలకు లోనవుతారు. యాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. దైవభక్తి పెరుగుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక వార్త లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. విష్ణు ఆరాధన మంచిది.
సింహం: బంధు, మిత్రులతో మనస్పర్తలు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాలకై ఎక్కువ శ్రమిస్తారు. హనుమత్ దర్శనం శ్రేయస్సునిస్తుంది.
కన్య: ఊహించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమచేయాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. ఇష్టదైవాన్ని కొలిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
తుల: కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధన లాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంది. రుణ బాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.
వృశ్చికం: ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. సమయానికి సహాయం చేసేవారున్నారు. బంధుజన సహకారం ఉంటుంది. కళాకారులకు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను పొందుతారు. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.
Aslo Read: Telangana Covid-19 curbs : తెలంగాణలో కోవిడ్ ఆంక్షల గడువు పెంపు.. అప్పటి వరకు అమలు
ధనుస్సు: రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటుంది. మానసిక ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. శివారాధన మంచినిస్తుంది.
మకరం: చేపట్టే పనుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేస్తారు. వాటిని ప్రారంభించడంలో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు. కీలక వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. .ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.
కుంభం: కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈ రోజు పూర్తిచేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.
Asko Read: Nizamabad Family Suicide Case : ఆ నలుగురిని వదలి పెట్టకండి.. వారే మా చావుకు కారణం
మీనం: ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ప్రయాణాల్లో ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీగణపతి ఆరాధనా శుభప్రదం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి