UPSC Recruitment 2022 : యూపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్.. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్‌ కొట్టేందుకు మంచి అవకాశం

UPSC latest Recruitment 2022 : యూపీఎస్సీ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. పలు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. ఖాళీల వివరాలు, చివరి తేదీ, అప్లై విధానం తదితర వివరాలు ఇదిగో.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2022, 12:45 AM IST
  • యూపీఎస్సీ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్
  • 187 పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్
  • ఖాళీల వివరాలు, చివరి తేదీ, అప్లై విధానం తదితర వివరాలు
UPSC Recruitment 2022 : యూపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్.. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్‌ కొట్టేందుకు మంచి అవకాశం

UPSC latest Recruitment 2022 Golden Chance Check vacancies, last date and eligibility : సెంట్రల్ గవర్నమెంట్ జాబ్‌.. అందులో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Union Public Service Commission) జాబ్ సాధించాలనుకునే వారికి సువర్ణ అవకాశం. యూపీఎస్సీ (UPSC) నుంచి జాబ్ నోటిఫికేషన్ (Job notification) వెలువడింది. అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ టైమ్ స్కేల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ (UPSC) దరఖాస్తులను కోరుతోంది. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. యూపీఎస్సీ (UPSC) అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 13, 2022. అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. యూపీఎస్సీ (UPSC) 187 పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ (Recruitment drive) నిర్వహిస్తోంది.

యూపీఎస్సీ (UPSC) రిక్రూట్‌మెంట్ ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

అసిస్టెంట్ ఇంజనీర్ క్వాలిటీ అస్యూరెన్స్ (Assistant Engineer Quality Assurance) (ఆయుధాలు-మందుగుండు సామగ్రి): 29 పోస్టులు

అసిస్టెంట్ ఇంజనీర్ క్వాలిటీ అస్యూరెన్స్ (ఎలక్ట్రానిక్స్): 74 పోస్టులు

అసిస్టెంట్ ఇంజనీర్ క్వాలిటీ అస్యూరెన్స్ (జెంటెక్స్): 54 పోస్టులు

జూనియర్ టైమ్ స్కేల్ (Junior Time Scale) (JTS): 17 పోస్టులు

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (Administrative Officer) : 09 (పోస్టులు)

అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) : 02

అసిస్టెంట్ కమీషనర్ (Assistant Commissioner) : 02

Also Read : Central Govt: కొవిడ్ ఎఫెక్ట్: ఆ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం!

UPSC రిక్రూట్‌మెంట్ 2022కు ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయడానికి ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ (ORA) వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

మరే ఇతర మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకున్నా కూడా అలాంటి అప్లికేషన్స్‌ చెల్లవు.

అభ్యర్థులు పుట్టిన తేదీ, ఎక్స్‌పీరియన్స్ (సూచించిన ఫార్మాట్‌లో), అర్హతలతో పాటు తదితర సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. సర్టిఫికేట్‌లను అప్‌లోడ్ చేయాలి. 

అయితే ఈ పీడీఎఫ్‌ ఫైల్స్‌ అప్‌లోడ్ చేయడానికి ఒక సైజ్‌ నిర్ణయించి ఉంటారు. పైన పేర్కొన్న మాడ్యూల్‌ల కోసం అయితే 1 MBకు మించి పీడీఎఫ్‌ ఫైల్స్ ఉండకూదు. ఇక ఇతర “అప్‌లోడ్ అదర్ డాక్యుమెంట్ ” మాడ్యూల్ కోసం 2 MBకి మించకుండా ఉండాల్సి ఉంటుంది. అలాగే ప్రింటౌట్ తీసుకున్నప్పుడు స్పష్టంగా కనిపించే విధంగా పీడీఎఫ్‌ (pdf) ఫైల్ ఉండాలి. 

UPSC రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి. జనరల్ అభ్యర్థులు రూ. 25 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. SC/ST/PwBD/మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 13 (11:59 PM) వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఎంతో అద్భుతమైన అవకాశం కాబట్టి అర్హత ఉన్న అభ్యుర్థులంతా మిస్ కాకుండా దరఖాస్తు (Apply) చేసుకోండి.

Also Read : Covid 19: 400 మంది పార్లమెంట్ సిబ్బందికి కరోనా.. బడ్జెట్ సమావేశాలకు ముందు కలకలం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News