Today's Horoscope January 20 2022: మేషం: సంతోషకరంగా కాలాన్ని గడుపుతారు. ఆటంకాలు ఎదురవకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త. ఈశ్వరధ్యానం శుభప్రదం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం: వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. మీకు అనుకూలంగా ఏదీ ఉండకపోవచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. నవగ్రహ ఆరాధన శుభప్రదం.


మిథునం: కాలానుగుణంగా ముందుకు సాగాలి. అనుకున్నది సిద్ధిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన, కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులను కలుస్తారు. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.


కర్కాటకం: మిశ్రమ కాలం. అప్రమత్తముగా ఉండాల్సిన సమయం. కీలక విషయాల్లో శ్రద్ధను పెంచాలి. సందర్భానుసారంగా ముందుకు సాగండి. బంధుమిత్రుల సలహాలు మేలైన ఫలితాన్ని ఇస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. శివాలయ సందర్శనం మంచిది.


సింహం: కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. పేరుప్రతిష్టలు దక్కుతాయి. ఆర్థికంగా కలిసివచ్చే కాలం. అంతా మంచే జరుగుతుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.


కన్య: కీలక పనుల్లో కుటుంబ సభ్యుల సలహాలు అవసరం అవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. ప్రయాణ సూచన ఉంది, చంద్రశేఖరాష్టకం చదవాలి.


Also Read: Fine for not wearing mask: మాస్కులు ధరించలేదని వేసిన జరిమాన అక్షరాల 86 కోట్ల రూపాయలు


తుల: ఒక శుభవార్త వింటారు. ఆనందంగా గడుపుతారు. ప్రారంభించిన పనులను ప్రణాళికా బద్ధంగా పూర్తి చేయగలుగుతారు. విందూవినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువులను కలుస్తారు. ఒక శుభవార్త మీ వింటారు. ధన వ్యయం ఉంది. ఇష్టదైవారాధన మంచిది.


వృశ్చికం: కృషితో పని చేయాలి. అవసరానికి తగిన సాయం అందుతుంది. కొన్ని విషయాలలో అనుకున్న దాని కన్నా ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. శత్రువుల విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సూర్యారాధన మంచి ఫలితాలను ఇస్తుంది.


ధనుస్సు: ప్రారంభించిన పనులలో ఊహించిన ఫలితాలు వస్తాయి. బంధుమిత్రులతో శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర విషయాల పట్ల దృష్టి తగ్గించాలి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.


మకరం: ఏకాగ్రతతో పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. ఇతరుల సూచనలు పాటించొద్దు. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.


Also Read: Dhanush, Aishwaryaa split: ధనుష్​, ఐశ్వర్య విడిపోయారు కానీ.. విడాకులు కాలేదట!


కుంభం: ప్రతి పనిలో ముందుచూపుతో వ్యవహరించాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచింది. అనవసర విషయాలలో సమయాన్ని వృథా చేయకండి. శివనామస్మరణ చేయండి.


మీనం: అనుకున్న పనులను పూర్తి చేస్తారు. విందూ వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు. కుటుంబంతో గడుపుతారు. ఇష్టదేవతా శ్లోకాన్ని చదవాలి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook