Dhanush, Aishwaryaa split: ధనుష్​, ఐశ్వర్య విడిపోయారు కానీ.. విడాకులు కాలేదట!

Dhanush, Aishwaryaa split: ధనుష్​, ఐశ్వర్యా విడాకుల విషయంపై ధనుష్ తండ్రి కస్తూరీ రాజా సంచనలన ప్రకటన చేశారు. ఆయన ఏం చెప్పారంటే..

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2022, 12:23 AM IST
  • ధనుష్ విడాకులపై స్పందించిన తండ్రి కస్తూరీ రాజా
  • కలహాలతోనే విడిపోయారన్న తమిళ సినీ నిర్మాత
  • ప్రస్తుతం ధనుష్​, ఐశ్వర్యలు చెన్నైలో లేరని వెల్లడి
Dhanush, Aishwaryaa split: ధనుష్​, ఐశ్వర్య విడిపోయారు కానీ.. విడాకులు కాలేదట!

Dhanush, Aishwaryaa split: ప్రస్తుతం సినీ వర్గాల్లో తమిళ హీరో ధనుష్​, సూపర్​స్టార్ రజనీకాంత్ కుమార్తే ఐశ్వర్యా రజనీకాంత్​లు విడిపోవడంపై తీవ్ర చర్చ సాగుతోంది.

జనవరి 17న (సోమవారం) రాత్రి.. ఇద్దరు కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియా ద్వారా తమ నిర్ణయాన్ని వెల్లడించారు. 18 ఏళ్ల ఏళ్లుగా కలిసున్న తాము ఇప్పుడు వేర్వేరు దారుల్లో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు (Dhanush  Aishwarya divorce) తెలిపారు.

అయితే ఈ విషయంపై ధనుష్​ తండ్రి, ప్రముక నిర్మాత కస్తూరీ రాజా సంచలన విషయాలు వెల్లడించారు. ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ధనుష్​, ఐశ్వర్యాలు విడిపోవడానికి కేవలం విభేదాలే కారణమని పేర్కొన్నారు. ఇలాంటివి పెళ్లైన ప్రతి జంట మధ్య జరిగేదేన్నారు. అయితే వాళ్లకు విడాకులు కాలేదని (Kasthuri Raja on Dhanush  Aishwarya divorce ) చెప్పారు. 

ప్రస్తుతం ధనుష్​, ఐశ్వర్యా ఇద్దరూ చెన్నైలో లేరని.. వారిద్దరూ తమ తమ పనుల్లో భాగంగా హైదరాబాద్​లో ఉన్నట్లు వెల్లడించారు. వాళ్లిద్దరితో ఫోన్లో మాట్లాడినట్లు పేర్కొన్నారు కస్తూరీ రాజా. వాళ్లకు కొన్ని సలహాలు కూడా ఇచ్చినట్లు (Dhanush Aishwarya family quarrel) వివరించారు.

ఐశ్వర్యాతో విడాకులపై ధనుష్ ప్రకటన ఇలా..

'18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకుని, సర్ధుకుని, పరిస్థితులను అలవాటు చేసుకుని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేరువేరు దారుల్లో ప్రయాణించే సమయం వచ్చింది. ఐశ్వర్య, నేను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మమ్మల్ని మేము అర్థం చేసుకునేందుకు మరింత సమయం వెచ్చించాలని  నిర్ణయించుకున్నాం.

మా నిర్ణయాన్ని దయచేసి గౌరవించండి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు తగినంత ప్రైవసీ ఇచ్చి సహకరించండి.
ఓం నమః శివాయ' అని ధనుష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఐశ్వర్యా కూడా ఇదే విధమైన పోస్ట్ (Dhanush on split with wife Aishwaryaa) చేశారు.

Also read: Actress murder case: భర్త చేతిలో సినీ నటి మర్డర్.. గోనెసంచిలో హీరోయిన్ శవం!

Also read: Pooja Hegde Bikini Photo: మాల్దీవుల్లో బుట్టబొమ్మ అందాల ఆరబోత.. బికినీలో వయ్యారాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News