Surya Grahan 2024 date, time and effect: సూర్యగ్రహణానికి కౌంట్‌డౌన్‌ స్టార్ట్ అయింది. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం రేపు అంటే ఏప్రిల్ 08, సోమవారం నాడు సంభవించబోతుంది. ఈసారి ఏర్పడే సూర్యగ్రహణం చైత్ర అమావాస్య నుండి రూపొందబోతుంది. అంతేకాకుండా అదే సమయంలో చైత్ర నవరాత్రులు కూడా మెుదలుకానున్నాయి. అందుకే ఈ గ్రహణానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ సూర్యగ్రహణం మీనరాశి, రేవతి నక్షత్రంలో ఏర్పడబోతుంది. ఇదే సమయాన కొన్ని అరుదైన యోగాలు రూపుదిద్దుకోనున్నాయి.  ఇది కొన్ని రాశులవారి శుభ ప్రభావాలను, మరికొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావాలను చూపబోతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యగ్రహణం సమయం
ఈసారి ఏర్పడబోయే సూర్యగ్రహణం సంపూర్మ సూర్యగ్రహణం. గత 54 ఏళ్లలో ఇదే సుదీర్ఘ సూర్యగ్రహణం. ఈ  గ్రహణం దాదాపు 5 గంటల 25 నిమిషాల పాటు ఉంటుంది. 1970 తర్వాత ఇంత సుదీర్ఘ సూర్యగ్రహణం ఏర్పడటం ఇదే తొలిసారి. 
ఏయే దేశాల్లో కనిపించబోతుంది..
భారత కాలమానం ప్రకారం, ఏప్రిల్ 8న సంభవించబోయే సూర్యగ్రహణం రాత్రి 9:12 గంటలకు ప్రారంభం కానుంది. ఇది అర్ధరాత్రి 2:22 వరకు కొనసాగుతుంది. అయితే ఈ సంపూర్మ సూర్యగ్రహణం మనదేశంలో కనిపించదు. కాబట్టి దాని సూత కాలం కూడా చెల్లదు. ఈ సూర్యగ్రహణం పశ్చిమ ఐరోపా, అట్లాంటిక్, ఆర్కిటిక్ మెక్సికో, ఉత్తర అమెరికా, కెనడా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, ఇంగ్లండ్‌లోని వాయువ్య ప్రాంతం మరియు ఐర్లాండ్‌లో కనపించబోతుంది.


Also Read: CM Revanth Reddy Horoscope: వైఎస్సార్ లా ఢిల్లీలో చక్రం తిప్పుతున్న సీఎం రేవంత్.. క్రోధి నామ సంవత్సరంలో ఆయన చరిష్మా ఎలా ఉండబోతుందో తెలుసా..?


ఈ రాశులపై శుభప్రభావం
ఈ గ్రహణం కొన్ని రాశులవారికి అనుకూల ఫలితాలను ఇవ్వబోతుంది. వృషభం, మిధునం, కర్కాటకం మరియు సింహ రాశికి చెందిన వ్యక్తులు లాభపడనున్నారు. మీకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారులు ఎన్నడూ లేని లాభాలను ఆర్జిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఇక మీ పై జీవితంలో అన్నీ సుఖసంతోషాలే వెల్లివిరుస్తాయి. 


ఈ రాశులపై అశుభ ప్రభావం
ఏప్రిల్ 8న ఏర్పడే సూర్యగ్రహణం మేష, వృశ్చిక, కన్యా, కుంభ, ధనుస్సు రాశుల వారికి అశుభకరంగా ఉండబోతుంది. కాబట్టి మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహారించాల్సి ఉంటుంది. మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మీరు ఉద్యోగ మరియు వ్యాపారాల్లో సమస్యలను ఎదుర్కోనే అవకాశం ఉంది. మీరు అమావాస్య రోజు ప్రయాణాలు మానుకోండి, లేకపోతే మీరు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. మీరు హెల్త్ పై దృష్టి పెట్టండి. ఈ గ్రహణం యెుక్క చెడు ప్రభావాలను నివారించడానికి పేదవారికి దానం చేయండి. 
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Solar Eclipse 2024: 500 ఏళ్ల తర్వాత సూర్యగ్రహణం రోజు చతుగ్రాహి యోగం.. ఈ 3 రాశుల వారికి డబ్బే, డబ్బు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook