Trigrahi Yog 2024: తెలుగు కొత్త సంవత్సరంలో మొదటి త్రిగ్రాహి యోగం.. ఈ రాశులవారికి డబ్బే, డబ్బు!
Trigrahi Yog 2024: బుధ గ్రహం మీన రాశిలో కలవడం కారణంగా ఏర్పడే త్రిగ్రాహి యోగం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఈ కింది రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.
Trigrahi Yog 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్యగ్రహంతో పాటు బుధ గ్రహం ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంది. ఈ రెండు గ్రహాలు రాశి సంచారం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అయితే బుధ గ్రహం ఈ ఏప్రిల్ నెలలో కూడా రాశిని మార్చుకోబోతోంది. ఈ గ్రహం ఏప్రిల్ 09వ తేదిన మీన రాశిలోకి సంచారం చేయబోతోంది. అయితే ఈ ఇప్పటికే ఆ రాశిలో శుక్రుడితో పాటు సూర్యగ్రహాలు సంచార దశలో ఉన్నాయి. ఇదే సమయంలో ఈ మూడు గ్రహాల కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం దాదాపు 50 సంవత్సరాల తర్వాత ఏర్పడడం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కూడా కలుగుతాయని వారంటున్నారు. అయితే ఈ త్రిగ్రాహి కారణంగా లాభపడే రాశులవారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కుంభ రాశి:
త్రిగ్రాహి యోగం ఏర్పడడం కారణంగా కొన్ని రాశులవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని కారణంగా అకస్మాత్తుగా విపరీమైన డబ్బును పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కొత్త ఉద్యోగాలు కూడా పొందవ్చు. దీంతో పాటు ఈ సమయంలో దృఢంగా ఉండడం వల్ల ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల సపోర్ట్‌తో అనేక ప్రయోజనాలు పొందే ఛాన్స్ కూడా ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఈ సమయంలో ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా వ్యాపారాల్లో ఉన్న చిక్కులు కూడా తొలిగిపోతాయి.
మిథున రాశి:
మిథున రాశివారికి కూడా త్రిగ్రాహి యోగం కారణంగా అనేక రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు కెరీర్‌లో కూడా ప్రత్యేకమైన పురోగతిని సాధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి కూడా ఈ సమయం చాలా భాగుటుంది. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు వ్యాపారం లాభసాటిగా నడుస్తుంది.
మీన రాశి:
ఈ త్రిగ్రాహి యోగ ప్రభావం మీన రాశివారిపై కూడా పడబోతోంది. దీని కారణంగా వీరికి శుభకాలం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఒంటరిగా ఉన్నవారికి వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. అలాగే అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి