Trigrahi Yog 2024 benefits: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. గ్రహాలన్నింటిలోకెల్లా నెమ్మదిగా కదిలే గ్రహం శనిదేవుడు.  కర్మఫలదాత అయిన శనిదేవుడు 30 ఏళ్ల తర్వాత తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. త్వరలో అదే రాశిలోకి బుధుడు, శుక్రుడు ప్రవేశించనున్నాడు. కుంభరాశిలో శని, శుక్రుడు మరియు బుధుడు కలయిక వల్ల మార్చి నెలలో త్రిగ్రాహ యోగం ఏర్పడుతుంది. ఈ పవిత్రమైన యోగం వల్ల కొందరికి అదృష్టాన్ని పట్టనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం
త్రిగ్రాహ యోగం వృషభరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. వ్యాపారస్తులు భారీగా లాభం పొందుతారు. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు కలిసి వస్తాయి. మీ గ్రాఫ్ పెరుగుతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆఫీసులో మీరు చేసిన ప్రాజెక్టు సక్సెస్ అవుతుంది, దీంతో మీ బాస్ మిమ్మల్ని పొగుడుతాడు. 
మిధునరాశి
మిథున రాశి వారికి త్రిగ్రాహి యోగం మేలు చేస్తుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు ఏ పని మెుదలుపెట్టినా వెంటనే కంప్లీట్ చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మీకు లక్ కలిసి వస్తుంది.
కుంభ రాశి
కుంభ రాశి యెుక్క లగ్న గృహంలో త్రిగ్రాహి యోగం ఏర్పడబోతుంది. దీంతో మీరు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ సంపద రెట్టింపు అవుతుంది. దంపతులకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. జాబ్ సాధించాలనే వారి కోరిక నెరవేరుతుంది. 
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Astrology: కుంభరాశిలో శని,కుజల అద్భుత కలయిక.. ఈ 3 రాశుల వారికీ ఊహించని లాభాలు..


Also Read: Garuda Puranam: జీవితంలో ఈ 4 పనులు చేసినవారికి మరణానంతరం మోక్షమార్గమేనట..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter