Tulsi plant Tips: తులసి మొక్క మీ ఇంట్లో ఉందా..అయితే ఈ సూచనలు పాటించాల్సిందే
Tulsi plant Tips: తులసి మొక్కకు హిందూమతంలో విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. ప్రతి ఇంట్లో తప్పకుండా కన్పించే ఈ తులసి మొక్క విషయంలో కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలంటున్నారు జ్యోతిష్య పండితులు.
తులసి మొక్కంటే హిందూమతంలో ఎంతటి ప్రాధాన్యత ఉందో..జాగ్రత్తలు కూడా అన్నే ఉన్నాయి. శుభ సూచకమైన ఈ మొక్క విషయంలో చాలా నియమ నిబంధనలు పాటించాలి. ఆ సూచనలు, నియమాలు ఏంటో తెలుసుకుందాం..
హిందూమత విశ్వాసాల ప్రకారం తులసి మొక్క ఇంట్లో ఉంటే శుభసూచకం. తులసి మొక్క ఉన్న ఇంట్లో.. పాజిటివ్ శక్తి ఉంటుందనేది ఓ నమ్మకం. తులసి మొక్కను లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి పూజ విషయంలో కొన్ని నియమాలున్నాయి. ఈ క్రమంలో లక్ష్మీదేవికి ప్రతిరూపమైన తులసి మొక్క విషయంలో ఆ సూచనలు పాటించకపోతే..ఆ వ్యక్తి కష్టాల్లో పడతాడు. సమస్యలు ఎదుర్కొంటాడు. అందుకే నిర్ణీత పద్ధతిలోనే పూజలు చేయాలి. అలా చేస్తే సుఖ సంతోషాలు, సంపద లభిస్తుంది.
అన్నింటికీ మించి తులసి మొక్క ఆకులు కోసేటప్పుడు, నీరు పోసేటప్పుడు, పూజ విషయాల్లో కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలని ఉంది.
తులసి మొక్క ఆకులు కోసేటప్పుడు జాగ్రత్తలు
తులసి మొక్కలో లక్ష్మీదేవి ఆవాసముంటుంది కాబట్టి..తులసి ఆకులు కోసేటప్పుడు చేతులు జోడించి అనుమతి తీసుకోవాలి. తులసి ఆకుల్ని కత్తి, కత్తెర, గోర్లతో ఎట్టి పరిస్థితుల్లోనూ కోయకూడదు. అకారణంగా తులసి ఆకుల్ని తెంపకూడదు. ఒకవేళ అలా చేస్తే..ఇంట్లో దౌర్భాగ్యం ఎదుర్కోవల్సి వస్తుంది.
తులసి మొక్కలు నీళ్లు ఎలా పోయాలి
తులసి మొక్కకు నీళ్లు పోసేటప్పుడు కూడా కొన్ని సూచనలు పరిగణలో తీసుకోవాలి. తులసిమొక్కకు సూర్యోదయం సమయంలో నీళ్లు పోయటం అన్నింటికంటే మంచి విధానం. అదే సమయంలో మోతాదు కంటే ఎక్కువ నీరు కూడా తులసి మొక్కకు పోయకూడదు. తులసి మొక్కకు నీళ్లు పోసేటప్పుడు ఏ విధమైన కుట్టుక లేని వస్త్రాలు ధరించి నీళ్లు పోయాలి. ఆదివారం, ఏకాదశి నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు. ఏకాదశి నాడు తులసి దేవి..విష్ణువు కోసం వ్రతం ఆచరిస్తుందట. స్నానం చేయకుండా అంటే శుభ్రత లేకుండా తులసి మొక్కకు నీరు పోయకూడదు.
తులసి మొక్కను ఇంట్లో పెంచడమే కాదు..ఆకులు కోసినా..నీళ్లు పోసినా ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..పుణ్యం కలగాల్సింది పోయి పాపం వెన్నాడుతుందని చెబుతున్నారు. అందుకే నియమ నిబంధలు పూర్తిగా తెలుసుకోవాలి.
Also read: Laxmi Puja 2022: తక్కువ సమయంలో ఇలా లక్ష్మీ కటాక్షం లభించి ధనవంతులు కావాలనుకుంటున్నారా..?>
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook