Tulsi Plant Precautions: హిందూ ధర్మం ప్రకారం ప్రతి ఇంట్లో తులసి మొక్కకు విశేష మహాత్యముంది. తులసి మొక్క ఇంట్లో ఉండటం శుభసూచకం. అయితే తులసి మొక్క విషయంలో కొన్ని సూచనలు పాటించకపోతే అనర్ధాలు జరుగుతాయంటున్నారు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులసి మొక్క ఇంట్లో ఉంటే శుభసూచకంగా భావిస్తారు. పాజిటివ్ శక్తి ఉంటుందనేది ఓ నమ్మకం. తులసి మొక్కను లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి పూజ విషయంలో కొన్ని నియమాలున్నాయి. ఈ క్రమంలో లక్ష్మీదేవికి ప్రతిరూపమైన తులసి మొక్క విషయంలో ఆ సూచనలు పాటించకపోతే..ఆ వ్యక్తి కష్టాల్లో పడతాడు. సమస్యలు ఎదుర్కొంటాడు. అందుకే నిర్ణీత పద్ధతిలోనే పూజలు చేయాలి. అలా చేస్తే సుఖ సంతోషాలు, సంపద లభిస్తుంది. తులసి మొక్క ఆకులు కోసేటప్పుడు, నీరు పోసేటప్పుడు, పూజ విషయాల్లో కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలట. ఆ వివరాలు మీ కోసం..


విష్ణువు పూజలో తులసి ప్రమేయం లేకపోతే ఆ పూజకు అర్ధం లేదంటారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి ఆవాసముంటుంది కాబట్టి..తులసి ఆకులు కోసేటప్పుడు చేతులు జోడించి అనుమతి తీసుకోవాలి. తులసి ఆకుల్ని కత్తి, కత్తెర, గోర్లతో ఎట్టి పరిస్థితుల్లోనూ కోయకూడదు. అకారణంగా తులసి ఆకుల్ని తెంపకూడదు. ఒకవేళ అలా చేస్తే..ఇంట్లో దౌర్భాగ్యం ఎదుర్కోవల్సి వస్తుంది. 


తులసి మొక్కకు నీళ్లు పోసేటప్పుడు కూడా కొన్ని సూచనలు పరిగణలో తీసుకోవాలి. తులసిమొక్కకు సూర్యోదయం సమయంలో నీళ్లు పోయటం అన్నింటికంటే మంచి విధానం. అదే సమయంలో మోతాదు కంటే ఎక్కువ నీరు కూడా తులసి మొక్కకు పోయకూడదు. తులసి మొక్కకు నీళ్లు పోసేటప్పుడు ఏ విధమైన కుట్టుక లేని వస్త్రాలు ధరించి నీళ్లు పోయాలి. ఆదివారం, ఏకాదశి నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు. ఏకాదశి నాడు తులసి దేవి..విష్ణువు కోసం వ్రతం ఆచరిస్తుందట. స్నానం చేయకుండా అంటే శుభ్రత లేకుండా తులసి మొక్కకు నీరు పోయకూడదు. 


Also read: Samsaptak Yog Effect: సంసప్తక యోగం ఎఫెక్ట్... ఆగస్ట్ 17 వరకు ఈ రాశులవారికి కష్టకాలం..



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook