COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tulsi Vivah 2023: హిందూ సాంప్రదాయంలో కార్తీకమాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ కార్తీక మాసంలో తులసి వివాహాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తులసి వివాహం తర్వాతే ఇతర శుభకార్యాలు కూడా ప్రారంభమవుతాయి. కార్తీక మాసంలో శ్రీమహావిష్ణువుని పూజించే క్రమంలో తులసీదేవిని పూజించడం వల్ల కూడా జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ దూరమవుతాయి. ఈ మాసంలో తులసి వివాహాలను చేయడం వల్ల కన్యాదానంతో సమానమైన పుణ్యఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు.


తులసి వివాహంలో భాగంగా ఉపవాసాలు ప్రత్యేక పూజలు చేసేవారు తప్పకుండా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచించిన కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో కొనసాగుతున్న విభేదాలతో పాటు ఇంట్లో ఆనందం, సంపద రెట్టింపు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే తులసి వివాహాన్ని చేసేవారు ఏయే పద్ధతుల్లో చేయడం వల్ల శ్రీమహావిష్ణు అనుగ్రహం లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


తులసి వివాహంలో భాగంగా తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే:


వైవాహిక జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న వారు తులసి వివాహాన్ని పూర్వికులు సూచించిన పద్ధతిలోనే చేయాల్సి ఉంటుంది.


తులసి వివాహం జరిపేవారు ముందుగా తులసి మొక్కను అందంగా అలంకరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా నీటితో మొక్కకు అభిషేకం చేయాలి. 


ఏకాదశి సమయంలో తులసి మొక్కను వాటి ఆకులను ముట్టుకోవడం అస్సలు మంచిది కాదు. అంతేకాకుండా తులసీ వివాహం రోజు మొక్కను అలంకరించిన తర్వాత చేతులతో తాకకూడదు.


తులసి వివాహంలో భాగంగా శ్రీమహావిష్ణువును కూడా పూజించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల విష్ణు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 


తులసి వివాహం రోజు సాయంత్రం పూట ఉసిరి చెట్టు వద్ద నెయ్యి దీపాన్ని వెలిగించడం వల్ల కుటుంబంలో ఏర్పడిన ఆర్థిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి.


Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  


తులసి కళ్యాణం జరిగిన తర్వాత ఆ మొక్కచుట్టు ఏడుసార్లు ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుంది. సంధ్యా సమయంలో తులసి ముందు నెయ్యి దీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.


తులసి కళ్యాణం రోజు తప్పకుండా తులసి స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల ఇంట్లో సంపద రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.


ఈ తులసి వివాహం రోజు తులసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఖీర్ ను మాత్రమే నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ లభిస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.


Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook