Ugadi 2021 Wishes In Telugu: ఉగ అనగా నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్షు అని అర్థాలున్నాయి. వీటికి 'ఆది' అనగా 'ఉగాది' కనుక ప్రపంచం ఆరంభమైన రోజున హిందూ సంప్రదాయం ప్రకారం మొదటిరోజును ఉగాది పండుగను జరుపుకుంటున్నాం. చైత్ర శుక్ల పాడ్యమి నాడే బ్రహ్మదేవుడు వివాలమైన సృష్టిని ప్రారంభించారని విశ్వసిస్తారు. ఉత్తరాయణ, దక్షిణాయనం అనే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. ఏప్రిల్ 13న తెలుగు నూతన సంవత్సరాది ఉగాది(శ్రీ ప్లవనామ సంవత్సరం) ప్రారంభం కాబోతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కనుక ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభిస్తే సకల శుభాలు జరుగుతాయని నమ్మకం. షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడిని తెలుగువారు ప్రత్యేకంగా తయారు చేసి స్వీకరిస్తారు. ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు వారందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు మీ స్నేహితులు, బంధువులు, సన్నిహితులకు శ్రీ ప్లవనామ ఉగాది శుభాకాంక్షలు తెలపండి.


Also Read: Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!


మధురమైన ప్రతి క్షణం
నిలుస్తుంది జీవితాంతం
రాబోతున్న కొత్త సంవత్సరం
అలాంటి క్షణాలనెన్నో
అందించాలని ఆశిస్తూ.. శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు


శ్రీ ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 
ఉగాది శుభాకాంక్షలు...
లక్ష్మీదేవి మీ ఇంటికి చేరాలని,
కరోనా వైరస్ మహమ్మారి మీ దరి చేరకూడదని,
అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ.. Happy Ugadi 2021


జీవితం సకల అనుభూతుల సమ్మిశ్రమం
స్థితప్రజ్ఞత అలవరుచుకోవడం వివేకుల లక్షణం
ఈ ఉగాది మీకు తెలిపే సందేవమిదే.. 
మీకు, మీ కుటుంబసభ్యులకు శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 


Also Read: Kumbh Mela 2021 Photos: ఘనంగా ప్రారంభమైన హరిద్వార్ కుంభమేళా, ఫొటో గ్యాలరీ


ఈ ఉగాది రోజున ఇంట్లోనే ఉందాం.. ఆనందంగా, ఆరోగ్యంగా ఉందాం.. మన బంధువులు, స్నేహితులను సైతం ఆరోగ్యంగా ఉంచుదాం కరోనా బారి నుంచి రక్షించుకుందాం.
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు


వసంతం మీ ఇంట రంగవల్లులు అద్దాలి. 
కోకిల మీ అతిథిగా రావాలి.
కొత్త చిగురులు ఆశల తోరణాలు కట్టాలి.. మీకు, మీ కుటుంబ సభ్యులకు తెలుగు సంవత్సరాది శ్రీ ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు


షడ్రుచుల సమ్మేళనం జీవితం. 
కష్టం, సుఖం, పాపం, పుణ్యం, మంచి, చెడుల కలయిక ఈ జీవితం.. అందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు


Also Read: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook