Ugadi 2023 Horoscope: అందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది 2023 తెలుగు క్యాలెండర్ ప్రకారం శోభకృత్ నామ సంవత్సరం. కొత్త ఏడాదిలో వివిధ రాశుల జాతకం ఎలా ఉంటుందనేది తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అందరూ విధిగా తమ తమ రాశి ఫలాలు ఈ శోభకృత్ నామ సంవత్సరంలో ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి Aries..


ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ఆదాయ, వ్యయాలు సమానంగా ఉండటం ఇందుకు కారణం. ఉద్యోగస్థులైతే ఉన్నత స్థానానికి చేరుకుంటారు. విద్యార్ధులు బాగా కష్టపడాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురౌతాయి. రుణ సమస్యలు రాకుండా చూసుకోవాలి. అదే సమయంలో పెట్టుబడులు లాభాల్ని ఇస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.


వృషభ రాశి Taurus..


ఈ రాశివారికి మంచి ఫలితాలుంటాయి. ఆదాయం కంటే వ్యయం కొద్దిగా తక్కువే ఉంటుంది. పెట్టిన పెట్టుబడులు లాభాన్నిస్తాయి. ఆర్ధికంగా ఇబ్బందులుండవు. ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా బాగుంటుంది. భూమి, ఇళ్లు కొనుగోలు చేస్తారు. ఇబ్బందులన్నీ తొలగుతాయి. ముఖ్యంగా ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి.


మిధున రాశి Gemini..


ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలుంటాయని చెప్పాలి. ఎందుకంటే ఆదాయం కంటే వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఆర్ధిక ఇబ్బందులు వెంటాడుతాయి. ఉద్యోగంలో మంచి పదవులు అధిరోహిస్తారు. వ్యాపారం విస్తరిస్తుంది. ఆరోగ్య సమస్యలుండటం వల్ల అప్రమత్తంగా ఉండాలి. విద్యార్ధులకు మాత్రం అనువైన సమయం. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. 


కర్కాటక రాశి Cancer..


ఈ రాశి వారికి మంచి ఫలితాలుంటాయి. ఆదాయం కంటే వ్యయం కొద్దిగా తక్కువే ఉండటం వల్ల ఆర్ధికంగా ఇబ్బందులుండవు. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి స్థానం పొందుతారు. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. అయితే మధ్య మధ్యలో ఇబ్బందులు ఎదురౌతాయి. అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావచ్చు. విద్యార్ధులకు కలిసొస్తుంది. 


సింహ రాశి Leo..


ఈ రాశివారికి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆదాయం కంటే వ్యయం చాలా చాలా తక్కువ ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలు రెండింట్లోనూ రాణిస్తారు. వ్యాపారంలో పెట్టుబడులతో పాటు లాభాలు కూడా పెరుగుతాయి. విద్యార్ధులకు చాలా బాగుంటుంది. ఆస్థుల కొనుగోలు లాభిస్తుంది. అయితే కొన్ని వివాదాలు మానసిక సమస్యకు కారణమౌతాయి. అప్రమత్తంగా ఉండాలి. ధనయోగం ఉంటుంది.


కన్యా రాశి Virgo..


ఈ రాశివారు ఆర్ధికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆదాయానికి వ్యయానికి చాలా వ్యత్యాసముంది. ఆదాయం కంటే వ్యయం 5 రెట్లు ఎక్కువ ఉంది. అయితే విద్యార్ధులకు శుభసూచకంగా ఉంటుంది. ఉద్యోగస్థులకు బాగున్నా..వ్యాపారులకు అంత అనువైంది కాదు. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.


తుల రాశి Libra..


ఈ రాశి వారికి మిశ్రమంగా ఉండవచ్చు. ఆదాయం కంటే వ్యయం కొద్దిగా తక్కువ. ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. సమాజంలో గౌరవం, కీర్తి లభిస్తుంది. విద్యార్ధులకు అనుకూలమైన సమయం.


వృశ్చిక రాశి Scorpio..


ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆదాయం, వ్యయం రెండూ సమానంగా ఉండాలి. ఉద్యోగస్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యాపారం లాభిస్తుంది. అయితే ఖర్చులు మాత్రం పెరుగుతాయి. కానీ ఆరోగ్యం బాగుంటుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విద్యార్ధులు అద్భుతంగా రాణిస్తారు. ఆర్ధికంగా జాగ్రత్తగా ఉండాలి.


ధనస్సు రాశి Sagittarius..


ఈ రాశి వారు తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉంటుంది. అయితే ఉద్యో, వ్యాపారాల్లో చాలా బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందితే..వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. విద్యార్ధులు ఉన్నత చదువుల వెరకూ వెళ్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇంట్లో పరిస్థితులు కూడా బాగుంటాయి. ఖర్చుల విషయంలో మాత్రమే జాగ్రత్త వహించాలి. 


మకర రాశి Capricorn..


ఈ రాశివారికి ధనయోగం ఉంటుంది. ఆదాయం కంటే వ్యయం చాలా తక్కువ ఉండటం వల్ల ఆర్ధిక ఇబ్బందులుండవు. విద్యార్ధులకు పరిస్థితి అటూ ఇటూ ఉంటుంది. అంటే కష్టాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి. వ్యాపారంలో కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడే రాణిస్తారు. 


కుంభ రాశి Aquarius..


ఈ రాశి వారికి అంతా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం కంటే వ్యయం చాలా తక్కువ ఉంటుంది. స్థిర చరాస్థులు పెరుగుతాయి. విద్యార్ధులకు చాలా అనుకూలమైన సమయం. ఉద్యోగస్థులకు పదోన్నతి లభిస్తుంది. వ్యాపారం తొలుత బాగుంటుంది. ఆ తరువాత జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. 


మీన రాశి Pisces..


ఈ రాశివారికి ఆర్ధిక ఇబ్బందులుండవచ్చు. అప్పులు తీసుకోకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ. విద్యార్ధులకు అనుకూలమైన సమయం. వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. విద్యా, వ్యాపార, ఉద్యోగ విషయమై విదేశీ ప్రయాణం ఉంటుంది. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి. ఏప్రిల్ నుంచి కలిసొస్తుంది. 


Also Read: Ugadi 2023: కొత్త ఏడాది శుభకృత్ నామ సంవత్సరం ఉగాది నాడు చేయాల్సిన ముఖ్యమైన పనులివే


Also Read: Nithiin Rashmika : ఒక హిట్ ఇస్తే రెండు మూడు ఫ్లాపులు.. కెరీర్ గురించి కౌంటర్లు వేసుకున్న నితిన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook