Shubhkrit Naam Samvatsaram 2023: హిందూమతం ప్రకారం ఇవాళ కొత్త ఏడాది ప్రారంభమైంది. తెలుగు ప్రజలు ఉగాదిగా కొత్త ఏడాదిని ఘనంగా జరుపుకుంటున్నారు. శోభకృత్ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పూజలు, పునస్కారాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా చేయాల్సిన ప్రత్యేక పద్ధతులు, నియమాలపై ఫోకస్..
చైత్ర శుద్ధ పాడ్యమిన వచ్చే ఉగాది పర్వదినానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఉగాది రోజున తెలుగు కొత్త ఏడాది ప్రారంభమౌతుంది. తెలుగు పంచాంగం ప్రకారం మార్చ్ 22 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఏడాది పేరు శుభకృత్ నామ సంవత్సరం. ఈ రోజున చేయాల్సిన ప్రత్యేక పూజలు, పద్ధతుల గురించి జ్యోతిష్యంలో వివరణ ఉంది. ఇవి చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, అదృష్టం లభిస్తాయని విశ్వాసం.
నవగ్రహాలకు రాజు సూర్యుడైనందున..ఈ రోజు అంటే ఉగాది నాడు ఉదయాన్నే లేచి అభ్యంగ స్నానమాచరించి..రాగి పాత్రల నీళ్లతో సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. ఆ తరువాత ఆదిత్య హృదయ స్తాత్రాన్ని 3 సార్లు పఠించాలి. దీనివల్ల సూర్యుడి ఆశీర్వాదం సదా ఉంటుందని విశ్వాసం. జీవితంలో అదృష్టం, ఆరోగ్యం లభిస్తాయని ప్రతీతి. కొత్త ఏడాది గణేశుడిని పూజిస్తారు. ఉగాది పచ్చడిగా పిలిచే వేప పువ్వు పచ్చడిని నైవేద్యంగా అర్పించాలి.
ఉగాది రోజు చేయాల్సిన పనులు..
1. ఇంటిని శుభ్రపరిచి అందమైన ముగ్గులు, మామిడి తోరణాలతో అలంకరించాలి. పసుపు నీళ్లను తలుపు రెండు మూలల్లో చల్లాలి. ఆ తరువాత పంచాంగం వినాలి.
2. ఉగాది నాడు పూర్తి భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో పూజలు చేసి..ఉగాది పచ్చని తప్పకుండా తినాలి
3. కొత్త ఏడాది రోజు వివిథ రకాల వంటలు చేసి దేవతలకు నైవేద్యంగా పెట్టాలి. షడ్రుచుల సమ్మేళనమైన వేప పువ్వు పచ్చడి ఉగాదికి ప్రత్యేకం.
4. ఉగాది రోజున దోష పరిహారం కోసం నిరుపేదలకు ఆహారం, డబ్బు, బట్టలు పంపిణీ చేయాలి.
5. ఉగాది రోజున తల్లిదండ్రులు, గురువుల నుంచి ఆశీర్వాదం పొందాలి. కొత్త ఏడాది రోజు వేపాకుల్ని ప్రత్యేకంగా తీసుకోవడం వల్ల ఏడాదంతా ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం.
Also Read: Ugadi New Year 2023: కొత్త ఏడాది శుభకృత్ నామ సంవత్సరం ప్రారంభం, ఈ రాశులకు తీవ్రమైన సమస్యలు తప్పవు
Also Read: Mrunal Thakur : అలాంటి విషయాలెవ్వరూ బయటకు చెప్పరు!.. మృనాల్ ఠాకూర్ ఎమోషనల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook