Ugadi Pachadi Importance 2024: ఉగాది పచ్చడి సూచించే 6 జీవిత అనుభవాలు ఇవే..
Ugadi Pachadi Importance 2024: ఉగాది పండగకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఆరోజు తయారు చేసుకునే పచ్చడి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పచ్చడి జీవితంలోని ఆరు అనుభవాలను తెలియజేస్తుంది. ఈ అనుభవాలే మానవ జీవితాలను సరైన మార్గంలో నడిపించేందుకు సహాయపడతాయి. అయితే ఉగాది పచ్చడి సూచిస్తున్న ఆరు అనుభవాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..
Ugadi Pachadi Importance 2024: హిందూ సాంప్రదాయం ప్రకారం ఉగాది పండగ తెలుగు ప్రజల మొదటి పండగగా భావిస్తారు. ఈ పండగ వెనక ప్రాచీన చరిత్ర ఉంది. ఈ ఉగాది పండగను శాతవాహన రాజుల నుంచే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని పురాణాల్లో వివరించారు. అంతేకాకుండా క్రీ.శ 2వ శతాబ్దానికి చెందిన హాలుడు రచించిన కొన్ని గ్రంథాల్లో కూడా ఉగాది పండుగకు సంబంధించిన ప్రాముఖ్యత, పంచాంగ వివరాలను క్లుప్తంగా వివరించారు. అంతేకాకుండా ఆనాడే ఉగాది పండగ రోజు తయారు చేసే పచ్చడి గురించి కూడా ఎంతో క్లుప్తంగా వివరించారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే పురాణాల ప్రకారం ఉగాది పచ్చడి లోని ఆరు రోజులు జీవితంలోని ఆరు అనుభవాలను సూచిస్తాయట. ఉగాది పచ్చడి సూచించే ఆరు అనుభవాలేంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉగాది పచ్చడి సూచించే ఆరు అనుభవాలు:
1. తీపి: ఇది జీవితంలోని ఆనందం, సంతోషం, విజయం వంటి సానుకూల అనుభవాలను సూచిస్తుంది.
2. చేదు: ఇది జీవితంలోని మొదలయ్యే కష్టాలు, దుఃఖం, నష్టం వంటి ప్రతికూల అనుభవాలను తెలియజేస్తుంది.
3. పులుపు: ఈ పులుపు మన జీవితంలోని ఉత్సాహం, సాహసం, సృజనాత్మకత వంటి అంశాలను తెలుపుతుంది.
4. ఉప్పు: జీవితంలోని స్థిరత్వం, భద్రత, నమ్మకం వంటి అంశాలను సూచిస్తుంది.
5. కారం: మన జీవితంలోని శక్తి, ధైర్యం, చర్యాశీలత వంటి అంశాలను తెలియజేస్తుంది.
6. వగరు: మనందరి జీవితంలోని విసుగు, నిరాశ, అసంతృప్తి వంటి అంశాలను తెలుపుతుంది.
ఈ ఆరు రుచుల కలయిక మన జీవితంలోని పూర్తి స్థితిని సూచిస్తాయని పురాణాల్లో పేర్కొన్నారు. అలాగే మన జీవితంలో వచ్చే సంతోషం, దుఃఖం, ఉత్సాహం, స్థిరత్వం, శక్తి, విసుగు వంటి అన్ని రకాల అనుభవాలను ఈ ఉగాది పచ్చడి పూర్తిగా తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ అనుభవాలే మానవుని సరైన జీవితంలో నడిపించేందుకు దారి చూపెడతాయి. అందుకే ప్రతి సంవత్సరం ఉగాది రోజున పచ్చడిని తప్పకుండా తీసుకోవాలని పురాణాల్లో పేర్కొన్నారు.
ఉగాది పచ్చడిని తినడం వల్ల మనం జీవితంలోని అన్నింటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తుంది. మనం మంచి, చెడు, సుఖం, దుఃఖం అన్నింటినీ సమానంగా స్వీకరించి, వాటి నుండి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. ఉగాది పచ్చడి ఒక సాంప్రదాయమైన రెసిపీనే కాదు.. ఇది ఒక జీవన సూత్రం గా కూడా భావించవచ్చు. ఈ సూత్రం మనకు జీవితంలోని అన్ని రుచులను ఆస్వాదించడానికి, వాటిని ఎక్స్పీరియన్స్ చేసేందుకు ప్రేరేపిస్తుందని అర్థం. అంతేకాకుండా జీవితంలో వస్తున్న సమస్యలను ఎదుర్కొనే శక్తిని కూడా ఇస్తుందని పూర్వీకులు చెప్పేవారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి