Vaara Rasi Phalalu: జూన్ నెలకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా ఈ నెలలో నుంచి వారానికి మరెన్నో ప్రాముఖ్యత ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ వారం ఎంతో శక్తివంతమైన శని గ్రహం కుంభరాశిలో త్రిలోగమనం చేయబోతోంది అంతేకాకుండా ఇదే రాశిలోకి చంద్రుడు కూడా ప్రవేశించబోతున్నాడు దీంతో శశి మహాపురుష రాజయోగం కూడా ఏర్పడబోతోంది. అలాగే కొన్ని గ్రహాలు ఈ వారం నక్షత్ర సంచారం కూడా చేయబోతున్నాయి. దీంతో ఈ వారానికి ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు అయితే ఈ వారం జరిగే గ్రహసంచారాలు, తిరోగమనం కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా శని చంద్రగ్రహాలు శుభస్థానంలో ఉన్న రాశుల వారికి ఈ సమయంలో విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అలాగే అదృష్టం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో ఎక్కువగా లాభాలు పొందబోయే రాశుల వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి: 
జూన్ 24 నుంచి 30 వరకు మేష రాశి వారు అనేక రకాల లాభాలు పొందుతారు. ముఖ్యంగా కెరీర్ పరంగా వీరి జీవితం ఊపందుకుంటుంది. అలాగే ఎలాంటి ప్రయోజనాలు లేకున్న పనులు చేసిన మంచి గుర్తింపు పొందుతారు. దీంతో పాటు కుటుంబ సభ్యుల సపోర్టు కారణంగా సులభంగా విజయాలు సాధిస్తారు. అలాగే ఈ సమయంలో మీ ఆదాయం కూడా ఒక్కసారిగా పెరుగుతుంది. దీంతోపాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ ప్రియమైన వారిని కూడా కలుస్తారు. అలాగే కుటుంబంలో ఆనందం పెరిగి  శుభకార్యాలు కూడా జరుగుతాయి. 


కర్కాటక రాశి: 
జూన్ చివరివారం కర్కాటక రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏవైనా అప్పులు ఉంటే సులభంగా చెల్లించ గలుగుతారు. అలాగే వృత్తి జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి. ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారు విపరీతమైన ఆదాయాన్ని పొందుతారు. అంతేకాకుండా రుణం తీసుకోవాలని ట్రై చేస్తున్న వారికి తక్కువ వడ్డీతో లభిస్తాయి. దీంతో పాటు ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన అదృష్టం సహకరించి గొప్ప లాభాలు పొందగలుగుతారు.


ధనస్సు రాశి: 
జూన్ చివరి వారంలోని ధనస్సు రాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారు కొత్త ఉద్యోగాలు పొందడమే కాకుండా ఉన్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కొడతారు. దీంతోపాటు కొత్త ఆదాయం వనరులు కూడా లభిస్తాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే భాగస్వామ్య జీవితంలో వస్తున్న గొడవలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. ఇక ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం చాలా శృంగారభరితంగా ఉంటుంది. దీంతో పాటు వ్యాపారాలు చేస్తున్న వారికి ఆశించని లాభాలు కూడా లభిస్తాయి. అలాగే కొత్తగా ప్రేమలో పడాలనుకుంటున్న వారికి ఈ సమయం చాలా సహకరిస్తుంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


మకర రాశి: 
మకర రాశి వారికి ఈ వారం ఆదాయం పరంగా ఎలాంటి డోకా ఉండదు. ఈ వారం వీరు వివిధ ఆధార వనరులు పొందడమే కాకుండా ఊహించని ధన లాభాలు కూడా పొందుతారు. అలాగే ఇంటి మరమ్మతులకు డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే సమయంలో తప్పకుండా మీ సోదరుల సలహా తీసుకోవడం చాలా మంచిది. దీంతో పాటు వైవాహిక జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ఈ సమయంలో మీ ప్రేమ జీవితం చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించగలుగుతారు. అంతేకాకుండా ఆరోగ్యం చాలావరకు సహకరిస్తుంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి