Vaikuntha Ekadashi : నేడు వైకుంఠ ఏకాదశి, తిరుమలతో పాటు అనేక ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం
Vaikuntha Ekadashi 2022 : ఇవాళ వైకుంఠ ఏకాదశి. అందుకే వేకువ జామున 1.45 గంటలకు తిరుమలలో వైకుంఠద్వార దర్శనం ప్రారంభమైంది. ఇవాల్టి నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం. వైకుంఠ ఏకాదశిన వైష్ణవ ఆలయాలకు వెళ్తే మంచిది.
Vaikuntha Ekadashi 2022: today mukkoti ekadashi ttd and other temples allows Vaikunta Dwara darshanam Check significance here : నేడు వైకుంఠ ఏకాదశి. ఈ పర్వదినానికి తిరుమల అంగరంగ వైభవంగా ముస్తాబైంది. వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తోంది టీటీడీ. (ttd) ధనుర్మాస కైంకర్యాలు పూర్తయ్యాయి. బుధవారం అర్ధరాత్రి దాటాక.. ఇవాళ వేకువ జామున 1.45 గంటలకు తిరుపతిలో (Tirupati) వైకుంఠద్వార దర్శనానికి (Vaikunta Dwara darshanam) భక్తులకు అనుమతి ఇచ్చారు. వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) సందర్భంగా గురువారం ఉదయం 9కి స్వామివారు స్వర్ణరథంపై దర్శనమివ్వనున్నారు.
ఇక ఇవాల్టి నుంచి పది రోజుల పాటు భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు. పలు దర్శనాల విధానాల ద్వారా రోజుకు 45వేల మంది శ్రీవారిని దర్శించుకోనున్నారు. శ్రీరంగంలో మాదిరిగా టీటీడీలో (ttd) పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉండనుంది. ఇక ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేంకటేశ్వరస్వామిని (Venkateswara Swamy) దర్శించుకునేందుకు, వైకుంఠ ద్వార ప్రవేశం పొందేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు (Tirumala) తరలి వస్తున్నారు.
ఇక వైకుంఠ ద్వార ప్రవేశానికి పది రోజులకు సంబంధించి రోజుకు 20వేల టికెట్స్ ప్రకారం.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్, ఐదు వేల ప్రకారం టైమ్ స్లాట్ సర్వదర్శన టికెట్స్ ఆన్‌లైన్ ద్వారా కేటాయించారు.
అలాగే స్థానికుల కోసం మరో ఐదు వేల టికెట్స్‌ను కరెంట్ బుకింగ్ ద్వారా తిరుపతిలోని (Tirupati) కేంద్రాల ద్వారా జారీ చేశారు.
Also Read : Makar Sankranti 2022: సంక్రాంతి రోజు ఈ పనులు చేస్తే.. సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలు మీ సొంతం
ఇక మార్గశిర మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశిగా.. (Vaikuntha Ekadashi) ముక్కోటి ఏకాదశిగా పేర్కొంటారు. ఈసారి ఈ వైకుంఠ ఏకాదశి నేడు అంటే జనవరి 13, గురువారం రోజు వచ్చింది. ఈ రోజంతా ఉంటుంది. వైకుంఠ ఏకాదశిన (Vaikuntha Ekadashi) బ్రాహ్మి ముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తి చేసుకుని.. వైష్ణవ ఆలయాలకు వెళ్తే ఎంతో మంచిది. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో ఈ వైకుంఠ ఏకాదశి ఒకటి. శ్రీహరికి ఇష్టమైన ప్రదేశం వైకుంఠం కాగా ఇష్టమైన తిథి ఏకాదశి. (Ekadashi) అలాంటి ఏకాదశుల్లో అత్యంత ప్రాధాన్యమున్నదే ఈ వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా ఆలయాల్లో (temples) ఈరోజు ఉత్తర ద్వార దర్శనం సౌకర్యాన్ని కల్పిస్తారు.
Also Read : Makar Sakranti 2022: తెలుగువారు 'సంక్రాంతి' పండుగను ఎందుకు జరుపుకుంటారు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook