Makar Sankranti 2022: సంక్రాతి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అయితే అన్ని ప్రాంతాల్లో సంక్రాంతి అనే పేరుతో కాకుండా వివిధ పేర్లతో ఈ పండుగ (Makar Sankranti Importance) చేసుకుంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు.
భోగి, మకర సంక్రాంతి, కనుమగా.. ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు తెలుగు (Makar Sankranti uniqueness) రాష్ట్రాల ప్రజలు. ఇందులో మకర సంక్రాంతికి ప్రత్యేక విశిష్ఠత ఉంది. మకర సంక్రాంతి రోజు చేసే కొన్ని పనులతో జీవితంలో సంతోషం, ఐశ్వర్యాలు నిండుతాయని హిందూ ధర్మం చెబుతోంది.
మరి సంక్రాంతి రోజు చేయాల్సిన పనులు (Things to do on Makar Sankranti) ఏమిటి? వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.
పుణ్య స్నానాలు..
మకర సంక్రాతి రోజున పుణ్య నదుల్లో లేదా వాటి జలంతో స్నానం చేయడం ద్వారా పాపాలు నశిస్తాయని చాలా మంది భావిస్తుంటారు. సూర్య దేవుడు ఈ రోజున తన కుమారుడు శని దేవుడి పట్ల అసంతృప్తిని వీడి ఆయన ఇంటికి వెళతాడని పురాణాలు చెబుతుంటాయి. కాబట్టి ఈ రోజు పుణ్య నదుల్లో స్నానం చేయడం ద్వారా సాధారణం కంటే వెయ్యి రెట్లు అధిక పుణ్యం లభిస్తుందని భావిస్తుంటారు.
సూర్యారాధన..
మకర సంక్రాంతి రోజు సూర్యుడు ఉత్తరాయాన్ని మారుస్తాడని చెబుతుంటారు. ఈ రోజు నుంచి సూర్యకాంతి ఎక్కువ సమయం పాటు భూమిపై పడుతుంది. అంటే పగటి పూట సమయం పెరుగుతుంది. రాత్రి సమయం తగ్గుతుంది. అందుకే ఈ రోజున సూర్యున్ని పూజించడం వల్ల మేలు జరుగుతుందని చెబుతుంటారు.
గో ఆరాధన..
మకర సంక్రాతి రోజు ఆవులకు పచ్చిమేత తినిపించి వాటిని సంతృప్తి పరిస్థే.. అది పుణ్యాలను తెచ్చిపడుతుంది. అంతే కాకుండా.. అనందాన్ని, శ్రేయస్సును పెంచుతుంది అని భావిస్తుంటారు.
ధానాలు..
పండుగలతో సంబంధం లేకుండా అవసరమైన వారికి ధానాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని తరచూ వింటుంటాం. అయితే మకర సంక్రాంతి రోజు.. నువ్వులు, బెల్లం, కొత్త బట్టలు, దుప్పట్లు వంటివి ధానం చేయడం వల్ల పుణ్యాలు కలుగుతాయని చెబుతుంటారు.
ఈ నైవేధ్యాలు పెటడం మంచిది..
మకర సంక్రాంతి రోజున నువ్వుల బెల్లం, ఖిచిడి వంటివి నైవధ్యంగా సమర్పించి.. వాటిని ప్రసాదాలుగా స్వీకరించాలి. ఇవి సూర్య దేవుడు, శని దేవుడి ఆశీర్వాదాలను అందిస్తాయని నమ్మిక. అయితే ఈ పదార్థాలు చలి కాలంలో వచ్చే వ్యాధులను కూడా దూరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
(గమనిక: ఈ కథనంలోని సమాచారం వివిధ వ్యక్తుల అభిప్రాయాల సేకరణ ద్వారా మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇందులో చెప్పిన విషయాలకు ZEE NEWS బాధ్యత వహించదు.)
Also read: Horoscope 2022 January 12: ఈ రాశి వారికి గడ్డు కాలం నడుస్తోంది జాగ్రత్త..
Also read: Makar Sakranti 2022: తెలుగువారు 'సంక్రాంతి' పండుగను ఎందుకు జరుపుకుంటారు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook