Mercury Retrograde 2022: తిరోగమన బుధుడి ప్రభావం... ఈ రాశులకు అపారమైన ప్రయోజనం..
Budh Gochar 2022: గ్రహాల యువరాజైన బుధుడు సెప్టెంబర్ 10న కన్యారాశిలో తిరోగమనం చేయనున్నాడు. దీని ప్రభావం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
Budh Vakri 2022 Effect: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల రాశి మార్పు అనేది ప్రతి ఒక్కరి జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. అది మంచైనా కావచ్చు లేదా చెడు అయినా కావచ్చు. గ్రహాల యువరాజైన బుధుడు సెప్టెంబర్ 10న కన్యారాశిలో తిరోగమనం (Mercury Retrograde in Virgo 2022) చేయబోతున్నాడు. ఈ తిరోగమన బుధుడి సంచారం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
సింహ రాశి (Leo): తిరోగమన బుధుడు సంచారం ఈ రాశివారికి కలిసి రానుంది. ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఎవరికైనా అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారంలో పెద్ద ఒప్పందం కుదుర్చుకుంటారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే అనుకూల సమయం. పచ్చని ధరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
వృశ్చిక రాశి (Scorpio): బుధుడి తిరోగమనం ఈ రాశివారికి లాభాలను ఇస్తుంది. వీరి ఆదాయం విపరీతంగా పెరగనుంది. కెరీర్ లో పురోగతి సాధిస్తారు. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. అదృష్టం కలిసి వచ్చి...ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి.
ధనుస్సు (Sagittarius): కన్యారాశిలో బుధుడి వక్రి ధనుస్సు రాశి వారికి అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి కల ఫలిస్తుంది. వ్యాపారులు తమ బిజినెస్ ను విస్తరిస్తారు. ఈ సమయంలో ఉద్యోగులు లాభపడతారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.
Also Read: Lord Shiva: గురు ప్రదోష వ్రతం ఎప్పుడు, శుభ ముహూర్తం, ప్రాముఖ్యత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook