Lord Shiva: గురు ప్రదోష వ్రతం ఎప్పుడు, శుభ ముహూర్తం, ప్రాముఖ్యత

Lord Shiva: భాద్రపద మాసంలోని రెండవ ప్రదోష వ్రతం 8 సెప్టెంబర్ 2022 నాజు జరుపుకోనున్నారు. ఇది గురువారం రావడంతో దీనిని గురు ప్రదోష వ్రతం అంటారు. గురు ప్రదోష వ్రత శుభ ముహూర్తం మరియు ప్రాముఖ్యతను తెలుసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 5, 2022, 12:46 PM IST
Lord Shiva: గురు ప్రదోష వ్రతం ఎప్పుడు, శుభ ముహూర్తం, ప్రాముఖ్యత

Guru pradosh vratam 2022: ప్రదోష వ్రతాన్ని ప్రతి నెల కృష్ణ మరియు శుక్ల పక్ష త్రయోదశి తిథి నాడు ఆచరిస్తారు. భాద్రపద మాసంలోని రెండో ప్రదోష వ్రతాన్ని 8 సెప్టెంబరు 2022 నాడు జరుపుకోనున్నారు. ఇది గురువారం రావడంతో దీనిని గురు ప్రదోష వ్రతం (Guru pradosh vratam 2022) అంటారు. ఈరోజున మహాదేవుడిని పూజిస్తారు. దీంతో పరమేశ్వరుడు సంతోషించి ప్రజల జీవితంలోని కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. భాద్రపద గరు ప్రదోష వ్రతం యెుక్క శుభ ముహూర్తం, ప్రాముఖ్యతను తెలుసుకోండి. 

గురు ప్రదోష వ్రత శుభ ముహూర్తం
భాద్రపద శుక్ల పక్షంలోని త్రయోదశి తిథి సెప్టెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి 12.04 గంటలకు ప్రారంభమై.. త్రయోదశి సెప్టెంబర్ 8వ తేదీ రాత్రి 9.02 గంటలకు ముగుస్తుంది. సూర్యాస్తమయానికి 45 నిమిషాల ముందు మరియు సూర్యాస్తమయం తర్వాత 45 నిమిషాలను ప్రదోషకాలంగా పరిగణిస్తారు.
గురు ప్రదోష వ్రత పూజ ముహూర్తం - 8 సెప్టెంబర్ 2022, సాయంత్రం 06:40 pm - రాత్రి 08:58 
పూజ వ్యవధి - 02 గంటల 18 నిమిషాలు

గురు ప్రదోష వ్రత విశిష్టత
ప్రదోష వ్రతం పాటించడం వల్ల మీ జాతకంలో అన్ని దోషాలు తొలగిపోతాయి. మీరు అనారోగ్య సమస్యలు మరియు బాధలను బయటపడతారు. ఈ సమయంలో మహాదేవుడు కైలాసంలో నృత్యం చేస్తారు. ప్రదోష సమయంలో మహాదేవుడు సంతోషరమైన భంగిమలో ఉన్నందున ఆయన అనుగ్రహాన్ని పొందేందుకు ఇదే ఉత్తమ సమయం. గురు ప్రదోష వ్రత ప్రభావం వల్ల మీరు శత్రువులపై విజయం సాధిస్తారు.

Also Read: కన్యారాశిలో బుధుడు తిరోగమనం.. ఈ రాశులవారి సంచులు డబ్బుతో నిండటం ఖాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News