COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Guru Vakri September 2023: సెప్టెంబర్‌ నెలలో చాలా గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నట్లు తెలిసిందే..జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రముఖ్యత కలిగిన బృహస్పతి గ్రహం తిరోగమనం చేసింది. ఈ గ్రహం డిసెంబర్‌ 31 వరకు తిరోగమన దశలోనే తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ గ్రహం తిరోగమనం చేయడం వల్ల మీన రాశి నుంచి మేషరాశి వరకు మొత్తం 12 రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అయితే ఈ ప్రభావం కారణంగా కొన్ని రాశులవారు మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ సమయంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


వృషభం:
బృహస్పతి గ్రహం తిరోగమనం కారణంగా వృషభ రాశివారు అనుకున్న పనులు సులభంగా చేస్తారు. అంతేకాకుండా వీరు ఈ సమయంలో దూర ప్రయణాలు కూడా చేస్తారు. దీంతో పాటు చదువుల కోసం విదేశాలకు కూడా వెళ్లే ఛాన్స్‌ కూడా ఉన్నాయి. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు వస్తాయి. కాబట్టి ఈ సమయంలో కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. 


మిథునం: 
మిథున రాశివారికి ఈ తిరోగమనం కారణంగా పొట్ట సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు ప్రమేషన్స్‌ పొందడమే కాకుండా భారీగా ఇంక్రిమెంట్స్‌ పొందుతారు. 


చదవండి : Central Govt Schemes: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఉచితంగా కుట్టు మిషన్లు.. అసలు విషయం ఇదే..!


కర్కాటక రాశి:
ఈ తిరోగమనం కారణంగా కర్కాటక రాశివారు కూడా మంచి ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా వ్యాపారాలు ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు వీరు కొత్త ఇండ్లతో పాటు వాహనాలు కూడా కొనుగోలు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 


సింహ రాశి: 
సింహ రాశివారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ తిరోగమనం కారణంగా అదృష్టం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. వీరు ఈ సమయంలో ఉత్సాహంతో పని చేస్తారు. అంతేకాకుండా ఆరోగ్య కూడా ఉంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 


చదవండి : Central Govt Schemes: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఉచితంగా కుట్టు మిషన్లు.. అసలు విషయం ఇదే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.