Mangal Gochar 2022: ఆస్ట్రాలజీలో కుజుడిని రెడ్ ప్లానెట్ గా వ్యవహారిస్తారు. అంతేకాకుండా క్రూరగ్రహమని కూడా అంటారు. ప్రస్తుతం మార్స్ మిథునరాశిలో తిరోగమనంలో ఉంది. మరో మూడు రోజుల్లో అంటే నవంబరు 13న కుజుడు తిరోగమన స్థితిలో వృషభరాశిలో సంచరించనున్నాడు. శుక్రుని రాశి అయిన వృషభరాశిలో తిరోగమన కుజుడు సంచారం వల్ల 5 రాశులవారు కెరీర్ మరియు వ్యాపారంలో పురోగతిని సాధించనున్నారు. నవంబర్ 13 నుండి ఏయే రాశుల వారి అదృష్టం ప్రకాశించనుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus)- తిరోగమన కుజుడి సంచారం ఈ రాశిలోనే  జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారు మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారం విస్తరిస్తుంది. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. జీవితంలో ఆనందం ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. 
తుల (Libra): అంగారక సంచారం తుల రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉపాధ్యాయులు, మార్కెటింగ్ మరియు మీడియా రంగానికి సంబంధించిన వ్యక్తులు లాభాలను పొందుతారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 
వృశ్చికం (Scorpio)- అంగారక సంచారం మీకు ధైర్యం, శక్తి, విశ్వాసాన్ని పెంచుతుంది. జీవితంలో సౌకర్యాలు పెరుగుతాయి. పనిలో మార్పు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీకు సమయం అనుకూలంగా ఉంటుంది. బిజినెస్ మంచి లాభాలు వస్తాయి. 


కుంభం (Aquarius): కుంభ రాశి వారికి కుజుడు సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. సంపద పెరుగుతుంది. కొత్త ఇల్లు, భూమి కొనుగోలు చేసే అవకాశం  ఉంది. జీవితంలో సౌకర్యాలు పెరుగుతాయి. కుటుంబ సహకారం లభిస్తుంది. వ్యాపారులకు కూడా ఈ సమయం బాగానే ఉంటుంది. 
మకరం (Capricorn): తిరోగమన కుజుడు రాశి మార్పు కెరీర్ లో పురోగతిని  ఇస్తుంది. కెరీర్‌లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉన్నత విద్య కోసం పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం పొందవచ్చు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న  అభ్యర్థులు విజయం సాధిస్తారు. పెళ్లికానీ యువతీయువకులకు వివాహం కుదిరే అవకాశం  ఉంది.


Also Read: Laxmi Narayan Yoga: లక్ష్మీనారాయణ యోగం.. ఈ 3 రాశులవారికి లాటరీ తగలడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి