Varalakshmi Vratham 2022: హిందువులకు అత్యంత పవిత్రమైంది 'వరలక్ష్మి వ్రతం'. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు పాటించే వ్రతం. ఈ వ్రతం ఎప్పుడుంది, పూజా విధానం, సమయం ఎప్పుడనేది తెలుసుకుందాం.. శ్రావణమాసం శుక్లపక్షంలోని చివరి శుక్రవారం నాడు జరిపేది వరలక్ష్మీ వ్రతం. హిందూవులు అత్యంత భక్తిశ్రద్ధలతో పాటించే వ్రతం ఇది. ముఖ్యంగా మహిళలు తప్పకుండా వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం ఆగస్టు 12వ తేదీన ఉంది. ఈ నేపధ్యంలో వరలక్ష్మీ వ్రతం తేదీ, పూజా సమయం, ముహూర్తం, ప్రాముఖ్యత వంటి అంశాల గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరలక్ష్మీ వ్రతం తేదీ, పూజా సమయం


హిందూ పంచాంగం ప్రకారం వరలక్ష్మీ వ్రతం శుభ ముహూర్తం ఆగస్టు 12వ తేదీ ఉదయం 6.40 నిమిషాల్నించి 8.51 నిమిషాలవరకూ ఉంది. ఇక వృశ్చికరాశివారికి మద్యాహ్నం 1.16 నిమిషాల్నించి 3.32 నిమిషాలవరకూ ఉంది. కుంభరాశివారికి సాయంత్రం 7.24 నిమిషాల్నించి 8.57 నిమిషాల వరకూ ఉంది. వృషభరాశివారికి తెల్లవారుజామున 12.08 నిమిషాల్నించి 2.06 నిమిషాల వరకూ ఉంది. 


వరలక్ష్మీ వ్రతం అనేది లక్ష్మీదేవికి అంకితమైన వ్రతం. ఈ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ధన సంపద, సంతోషం కోసం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ వ్రతం ఆచరిస్తారు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవికి పూజలు చేసి ప్రసన్నం చేసుకుంటే..భక్తుల కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. అందుకే లక్ష్మీదేవిని వరాలిచ్చే లక్ష్మి వరలక్ష్మిగా పిలుస్తారు. 


వరలక్ష్మీ వ్రతం పూజా విధానం


ఈ రోజున మహిళలు ఉదయాన్నే లేచి ఉపవాస దీక్ష చేస్తారు. లక్ష్మీదేవికి పూజలు చేస్తూ తాజా పండ్లు, స్వీట్స్ సమర్పిస్తారు. వరలక్ష్మీ వ్రతం నాడు మహిళలు కొన్ని రకాల ఆహార పదార్ధాలు తినకుండా దూరంగా ఉంటారు. రాగి చెంబుకు చీర కట్టి..స్వస్తిక్ గుర్తు, కుంకుమ, చందనం రాస్తారు. ఆ రాగి చెంబులో నీళ్లు లేదా బియ్యం లేదా నాణేలు లేదా ఐదు విభిన్నమైన పత్రాలు నింపుతారు. 


రాగిచెంబు ముఖభాగం వద్ద కొన్ని మామిడి ఆకులు కడతారు. పసుపు రాసిన కొబ్బరికాయను ఆ రాగిచెంబుపై ఉంచుతారు. పవిత్రమైన దారాన్ని ఆ చెంబుకు కడతారు. వ్రతం మరుసటి రోజు ఆ చెంబులోని నీటిని ఇంట్లో చల్లుతారు. అందులో బియ్యంతో అన్నం లేదా ప్రసాదం వండుకుని తింటారు. 


Also read: Bhadrapada Amavasya 2022: భాద్రపద అమావాస్య ఎప్పుడు? శుభ సమయం, ప్రాముఖ్యతను తెలుసుకోండి



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook