Varalakshmi Vratham 2023 Wishes: మీకు, మీ స్నేహితులకు వరలక్ష్మీ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ప్రత్యేక శుభాకాంక్షలు..
Varalakshmi Vratham 2023 Wishes In Telugu: వరలక్ష్మీ వ్రతం రోజున ఆడపడుచులంతా లక్ష్మీదేవిని పూజించి ఉపవాసాలు పాటిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షాలు ఎల్లవేళలా కుటుంబానికి కలుగుతాయని నమ్మకం.. ఈ అమ్మవారి అనుగ్రహం మీకు, మీ మిత్రులకు కలగాలని కోరుకుంటూ వరలక్ష్మీ వ్రతం ప్రత్యేక శుభాకాంక్షలు.
Varalakshmi Vratham 2023 Wishes In Telugu: ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. హిందూ సాంప్రదాయంలో ఈ వ్రతాన్ని ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ఈ రోజు మహిళలంతా..లక్ష్మీ దేవిని పూజించి ఉపవాసాలు పాటిస్తారు. అంతేకాకుండా జీవితంలో కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఈ శుభ దినాన్ని పురష్కరించుకుని మీ స్నేహితులకు, కుంటుబ సభ్యులకు ఇలా అమ్మవారికి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేయండి..
స్నేహితులకు, కుంటుబ సభ్యులకు ఇలా శుభాకాంక్షలు తెలపండి:
❃ మహాలక్ష్మి అనుగ్రహం సదా మీపై ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు..
❃ సిరులు ఇచ్చే శ్రీ మహాలక్ష్మి మీ ఇంట సిరులు కురిపించే శ్రావణ లక్ష్మికి స్వాగతం పలుకుతూ ఈరోజు మీకు సకల సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటూ మీకు మీ స్నేహితులకు "వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు".
❃ తెలుగింటి ఆడపడుచులకు సౌభాగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే పండగ వరలక్ష్మి వ్రతం.
"వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు".
❃ పవిత్ర శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం జరుపుకునే మహిళలకు వారి కుటుంబ సభ్యులకు ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లవేళలా లభించాలని కోరుకుంటూ "వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు".
❃ వరలక్ష్మి మీపై సిరి సంపదలు కురిపించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు "వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు"
❃ వరలక్ష్మి ఆశీస్సులతో మీరందరూ సుఖసంతోషాలతో పాటు నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ తెలుగు రాష్ట్ర ప్రజలకి శ్రావణ శుక్రవార "వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు".
❃ వరలక్ష్మి దేవి కృపా కటాక్షాలు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు "వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు".
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి