Lord Saraswathi Devi: కొందరికి పుట్టుకతోనే మాటలు సరిగ్గారావు. మాట్లాడేటప్పుడు నత్తిగా మాట్లాడుతారు. పదాలు కూడా స్పష్టంగా పలకలేరు. దీంతో వీరి తల్లిదండ్రులు ఎంతో ఇబ్బందులు పడుతుంటారు. తమ పిల్లలను తీసుకుని ఆస్పత్రుల చుట్టు తిరుగుతూ ఉంటారు. కానీ మరికొందరు మాత్రం.. టెంపుల్స్ చుట్టు, డాక్టర్ల చుట్టు తిరుగుతుంటారు. తమపిల్లలు మాట్లాడటానికి కష్టపడుతుంటే తల్లిదండ్రులు అస్సలు తట్టుకోలేరు. ఇతరుల పిల్లలు గలగల మాట్లాడుతూ.. తమ పిల్లలు మాట్లడకుంటే మాత్రం.. వారి బాధలు మాత్రం వర్ణానాతీతం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Wedding: ఈ పరిహారాలు పాటిస్తే మీ ఇంట్లో వెంటనే పెళ్లి బాజాలు.. జ్యోతిష్యులు చెబుతున్న సూచనలివే..


అయితే.. ఇలాంటి వారు వసంత పంచమి రోజు కొన్ని ఇలా చేస్తే గల గల మాట్లాడుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. వసంత పంచమి రోజు సరస్వతి దేవీ జన్మదినంగా భావిస్తారు. వసంత పంచమినే శ్రీపంచమి అని కూడా అంటారు. ఈ రోజున శారదా దేవీని భక్తితో పూజిస్తారు. సరస్వతి దేవీ అనుగ్రహం ఉంటే జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ముఖ్యంగా చదువులు, ఎగ్జామ్ లలో రాణిస్తారు.


వసంత పంచమిరోజు ఉదయాన్నే నిద్రలేవాలి. ఆ తర్వాత..  పూజాదికాలు చేసుకొవాలి.  ఈరోజున అమ్మవారిని భక్తితో  పూజించిన వారిమనస్సులోని కోరికలన్ని నెరవేరుతాయంటారు. అదే విధంగా.. ఈరోజున మాటలు సరిగ్గారాని పిల్లల నాలుకపై శ్రీకారం రాస్తారు. బంగారం తీగను సరస్వతి పాదల వద్ద పెట్టి.. దానితో మాటలు రాని పిల్లల నాలుక మీద రాస్తే గడ గడ మాట్లాడుతారని చెబుతుంటారు.


Read More: Natural Skin Glow: పండుగలలో, పెళ్లిలో ప్రత్యేకంగా కనిపించడానికి ఈ జ్యూస్‌ బెస్ట్


అమ్మవారి ఆశీస్సులతో విద్యారంగంలో రాణించి జీవితంలో గొప్పగా స్థిరపడుతారని చెబుతుంటారు. అదే విధంగా ప్రస్తుతం శారదా నవరాత్రుల ఉత్సవం జరుగుతుంది. సరస్వతి అమ్మవారి లాగే.. శారదా అమ్మవారు కూడా తన చేతిలో వీణను పట్టుకుని ఉంటారు. వసంత పంచమిరోజును ఎంతో మంచి రోజుగా చెప్తుంటారు. అందుకే ఈరోజున వేలాదిగా పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతుంటాయి. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook