Tips For Natural Glow: మహిళలు అందం కనిపించడానికి ఎన్నో ప్రొడెట్స్‌ను ఉపయోగిస్తారు. ఈ ప్రొడెట్స్ ఉపయోగించడం వల్ల చర్మం పొడిగా, మచ్చలు వంటి ఇతర సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఖర్చు లేకుండా అందంగా కనిపించాలి అంటే మన ఇంట్లో ఉపయోగించే కొన్ని ఆహార పదార్థాలు ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఉపయోగించడం వల్ల శరీరానికి అలాగే ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతం అవుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
కొన్ని ఆహార పదార్థాలతో తయారు చేసిన జ్యూస్‌లను తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. దీని వల్ల ముఖం అందంగా కనిపిస్తుంది. సహజమైన కాంతిని పొందడానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఈ జ్యూస్‌లను రెగ్యులర్ గా తీసుకుంటే చర్మానికి సహజమైన మెరుపును తెస్తుంది.
బీట్‌రూట్, ఉసిరి జ్యూస్:
బీట్‌రూట్ , ఉసిరి తీసుకోవడం ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇందులో విటమిన్ సి లభిస్తుంది.ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వల్ల మీ ముఖం కాంతివంతంగా ఉంటుంది.
దోసకాయ, పుదీనా జ్యూస్:
చర్మం ఎల్లప్పుడు హైడ్రేట్‌గా ఉంచడంలో దోసకాయ, పుదీనా ఎంతో ఉపయోగపడుతాయి. దీని వల్ల ముఖం మీద మచ్చలు, జిడ్డు వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
అల్లం, బీట్‌రూట్, ఉసిరి మిక్స్ జ్యూస్:
వీటిని యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్‌గా పిలుస్తారు. దీనితో పాటు ఉసిరిలో అధిక మొత్తంలో విటమిన్ సి లభిస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల మీ చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
కూరగాయల జ్యూస్:
బీట్‌రూట్, క్యారెట్, బ్రోకలీ, అల్లం వంటి కూరగాయలను జ్యూస్ చేసి తాగడం ఎంతో మంచిది. ఈ ఆహారాలన్నీ పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read Beauty tips: రోజూ క్రమం తప్పకుండా ఇలా చేస్తే 50 ఏళ్లయినా నిత్య యౌవనం
నీరు, నిమ్మకాయ జ్యూస్:
వీటిని ఉపయోగించి జ్యూస్ తయారు చేసుకొని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అలాగే నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీని వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. అలాగే చర్మం కాంతివంతంగా తయారు అవుతుంది.
Also Read Kids Health: పిల్లల ఎదుగుదలకు అవసరమైన ఆహారాలు ఏంటి? వీటిని తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter