Things that Bring Good luck: మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ మీ దగ్గర డబ్బు నిలవట్లేదా? పేదరికతో బాధపడుతున్నారా? వీటిన్నింటికి పరిష్కారాలు వాస్తు శాస్త్రంలో పేర్కొనబడ్డాయి. డబ్బు సంపాదించడానికి వాస్తు శాస్త్రంలో (Vastu Shastra) అనేక చిట్కాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో అష్టఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆ విగ్రహాలేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంట్లో ఏనుగు విగ్రహం ఉంచితే..
ఇంట్లో రోజువారీ గొడవలు ఉన్నాయా, ప్రశాంతత కరువైందా... అయితే ఇంటికి వెండి లేదా ఇత్తడి ఏనుగు విగ్రహాన్ని (elephant idol) తీసుకురండి. ఇది ఇంటి రాహు దోషాన్ని తో తొలగించడంతోపాటు అపారమైన సంపదను ఇస్తుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే నివసిస్తుంది. 


ఇంట్లో తాబేలు విగ్రహం ఉంటే..
హిందూ మతంలో తాబేలు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. తాబేలను విష్ణువు స్వరూపంగా కొలుస్తారు. వాస్తుప్రకారం, ఏదైనా లోహంతో చేసిన తాబేలు విగ్రహాన్ని (turtle idol) ఇంటికి తెస్తే..దానిని తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచాలి. మీరు ఈ విగ్రహాన్ని ఇంటి డ్రాయింగ్ రూమ్‌లో కూడా ఉంచవచ్చు. దీంతో మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. 


ఇంట్లో చేప విగ్రహం పెడితే..
వాస్తు ప్రకారం, ఇంట్లో వెండి లేదా ఇత్తడి చేప విగ్రహాన్ని (fish idol) ఉంచడం వల్ల కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఈ విగ్రహాన్ని ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి. దీంతో మీకు అనేక మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. ఇంట్లో ఆనందం పెరుగుతుంది. 


Also Read: Lord Shiva: గురు ప్రదోష వ్రతం ఎప్పుడు, శుభ ముహూర్తం, ప్రాముఖ్యత 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook