Vastu Tips: ఈ దిశలో తలపెట్టి పడుకుంటే.. ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం మీ సోంతం
Vastu Tips: జీవితంలో ప్రతి విషయంపై వాస్తు ప్రభావం చూపిస్తుందని చాలా మంది నమ్ముతారు. మరి వాస్తు శాస్త్రం ప్రకారం నిద్రించే సమయంలో తల ఏ దిశలో ఉండాలి? ఏ దిశలో ఉండకూడదు అనే విషయాలు తెలుసుకుందాం.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో శ్రేయస్సు మొదలుకుని, అనవసర ఖర్చులు తగ్గించుకోవడం, ఆదాయాన్ని పెంచుకోవడం ఎలా అనే అన్ని సమస్యలకు పరిష్కారాలు ఉంటాయి. అలానే ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలి అనే విషయంతో పాటు ఇంట్లో పడుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు రాత్రి పడుకునేటప్పుడు తల ఏ దిశలో పెట్టాలి? ఏ దిశలో తల పెట్టకూడదు? అనే అంశంపై వాస్తు నిపుణులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. నిద్ర పోయే సమయంలో తల ఏ దిశలో పెడుతున్నారనే విషయంపైనే మీ గౌరవం, ఆరోగ్యం, జీవితంలో ముఖ్యమైన విషయాలు ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఈ అంశంపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నిద్రపోయే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరం వైపు తల పెట్టి పడుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. ఇలా చేయడం ద్వారా ఆయస్కాంత చలనం నిరోధించబడుతుందని చెబుతున్నారు. ఈ కారణంగా నిద్ర సరిగ్గా పట్టకపోవడం, తలనొప్పి, మానసిక ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
తల దక్షిణం వైపు, కాళ్లు ఉత్తరం వైపు ఉంచి నిద్రపోవడం ఉత్తమ విధానమని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ఇలా చేడడం ద్వారా ఆరోగ్యంతో పాటు, ఆనందం, ఐశ్వర్యం మీ వెంటే ఉంటుందని అంటున్నారు.
తూర్పు దిశలో తలపెట్టి నిద్రించడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. విద్యార్థులు, చదువుకునే వారు ఈ దిశలో పడుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.
Also read: Vastu Tips: ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు.. అదృష్టం వరిస్తుంది..!
Also read; Shani Effect: శని రాశి మారుతూనే...ఈ రాశులపై తీవ్ర ప్రభావం, ఏం జరుగుతుందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook